విజయానికి అందం అడ్డయ్యింది!

‘బాగా చదివాను. మంచి మార్కులు వస్తాయని ఆశించాను. కానీ రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు’... అంటూ సంబర పడింది ప్రాచీ నిగమ్‌. టీనేజీ అమ్మాయి... అనుకోని విజయానికి ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

Published : 24 Apr 2024 14:04 IST

‘బాగా చదివాను. మంచి మార్కులు వస్తాయని ఆశించాను. కానీ రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు’... అంటూ సంబర పడింది ప్రాచీ నిగమ్‌. టీనేజీ అమ్మాయి... అనుకోని విజయానికి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ప్రశంసలు వెల్లువెత్తుతాయని ఆశించి ఉంటుంది కాబోలు. కానీ విమర్శలు మొదలయ్యాయి...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ ప్రాచీది. తనకి హార్మోనుల్లో అసమతుల్యత కారణంగా మూతి మీద, గడ్డంపై అవాంఛిత రోమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లే కదా అని వాళ్లమ్మానాన్నలూ పట్టించుకొని ఉండకపోయుండొచ్చు. తాజా పది ఫలితాల్లో తనకి 600కి 591 మార్కులొచ్చాయి. దాదాపుగా అన్నింటా పూర్తి మార్కులు రావడం, రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించడంతో ఈమె ఫొటో, మార్కులు షీటు వైరలయ్యాయి. అయితే చాలామంది దృష్టి ఆమె మార్కులపై కాదు, రూపురేఖలపైకి మళ్లాయి. అవాంఛిత రోమాలను చూసి, వెక్కిరింపులు... మీమ్స్‌ ప్రారంభించారు. కొందరైతే ఆమె ముఖాన్ని ఫొటోషాప్‌లో తీర్చిదిద్ది ‘అమ్మాయంటే ఇలా అందంగా ఉండాలి’ అంటూ పోస్టులూ పెడుతున్నారు. టీనేజీ అంటేనే శారీరకంగానూ, భావోద్వేగాలపరంగానూ ఇబ్బందులుంటాయి. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లూ సరేసరి. ఈ వయసులో ‘ఇదే అందం’ అంటూ బలవంతంగా రుద్దడం ఎంతవరకూ సమంజసం? ఇవన్నీ ఆ చిన్ని హృదయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయి... అంటూ కొందరు ఆమెకు అండగా నిలిచినా... ఇకనైనా ‘లుక్‌’పై దృష్టిపెట్టాలన్న సలహాలూ ఎక్కువే! నిజానికి ఇది ప్రాచీ సమస్యే కాదు, విజేతలైన ప్రతి ఒక్క అమ్మాయి రూపురేఖలపైనా ఈ చర్చ మొదలవుతుంది. అమ్మాయంటే అందం ఒక్కటేనా? ఆమె విజయం కంటే రూపురేఖలకే అధిక ప్రాధాన్యమా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్