పాదాలకు వ్యాయామం!
సన్నబడాలనో, పొట్ట తగాలనో... రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. మరి పాదాల ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోం.
సన్నబడాలనో, పొట్ట తగాలనో... రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. మరి పాదాల ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోం. వీటికి సంబంధించిన కొన్ని చిన్నపాటి వ్యాయామాలను చూద్దామా...
కొవిడ్‌తో మారిన జీవనశైలి... మహిళలకు పనిభారాన్ని పెంచేసింది. వంట, అంట్లు తోమడం, వాషింగ్ మెషిన్లో దుస్తులు వేయడం, ఇల్లు శుభ్రం చేయడం... ఇలా దాదాపు అన్ని పనులూ ఎక్కువ సేపు నిలబడే చేయాల్సి రావడం వల్ల కాళ్లపై భారం పడుతోంది. ఇలాంటప్పుడు కొన్ని వ్యాయామాలు చేస్తూ కాళ్లు, వేళ్లు, పాదాలకు సాంత్వన కలిగించవచ్చు.
కాలివేళ్లు...
* కుర్చీపై కూర్చొని కాలి కింద తువాలును పరవాలి. ఇప్పుడు దాన్ని కాలి వేళ్లతో లాగాలి. రెండు కాళ్లతో అయిదారుసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కాలి కండరాలు బలంగా మారతాయి. కాలివేళ్లు సౌకర్యంగా ఉంటాయి.
* కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలపై సమాంతరంగా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా పాదాన్ని నేలకు ఆనించి వేళ్లను మెల్లిగా పైకి లేపాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి.
బంతాట!
కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. టెన్నిస్ బంతిని పాదం కింద పెట్టి ముందుకు వెనక్కి రెండు నిమిషాల పాటు జరపాలి. రెండోకాలితోనూ చేయాలి. దీనివల్ల కాలివేళ్లతో పాటు పాదానికీ సాంత్వన లభిస్తుంది. కావాలంటే బంతిపై పాదంతో మరికాస్త ఒత్తిడిని పెంచొచ్చు.
కండరాలకు సాంత్వన..
కుర్చీలో కూర్చొని ఒక కాలిని మరోకాలి మోకాలిపై పెట్టాలి. కాలివేళ్లను చేత్తో పట్టుకుని పెద్దవేలి వైపునకు వంచాలి. ఇలా చేయడం వల్ల పాదం, కాలి మడమల దగ్గర ఫ్లెక్సిబుల్‌గా మారి హాయిగా ఉంటుంది. మరోకాలితోనూ చేయడం మరవొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- గుడ్డు పెంకులతో అందం..!
- చిరుత అందం... అందుకుందామా?
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా?
- పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- రెడ్ రోవర్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
యూత్ కార్నర్
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
'స్వీట్' హోం
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
వర్క్ & లైఫ్
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!