తెల్ల రక్తకణాల్ని పెంచే చిలగడదుంపలు...

తియ్యటి రుచితో.... అందుబాటు ధరలో దొరికే చిలగడదుంపల్లో పోషకాలు ఎక్కువే. వీటిని క్రమం తప్పక తింటే... పోషకాహార లేమిని అధిగమించొచ్చు.

Published : 17 Jun 2021 01:15 IST

తియ్యటి రుచితో.... అందుబాటు ధరలో దొరికే చిలగడదుంపల్లో పోషకాలు ఎక్కువే. వీటిని క్రమం తప్పక తింటే... పోషకాహార లేమిని అధిగమించొచ్చు.
చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్‌, విటమిన్‌-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులూ తీసుకోవచ్చు. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్‌ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది.
* ఇందులో ఉండే కెరొటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయల్నీ తగ్గిస్తాయి.
* ఈ దుంపల్లో మనకి అవసరమైన ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరఫరాని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్