బాల్యంలో వ్యాయామం... భవిష్యత్తులో ఆరోగ్యం

మధు తన పిల్లలను కొంచెం వేగంగా కూడా పరుగెత్తనివ్వదు. ఎక్కడ పడిపోతారోనని ఆందోళనపడుతుంది. తల్లిగా పిల్లలకు గాయాలు తగులుతాయని భయపడటం సహజం. ఆ అనుమానమే భవిష్యత్తులో ఆ చిన్నారుల మెదడు చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ పరిశోధన ధ్రువీకరించింది. బాల్యంలో పిల్లలు చేసే వ్యాయామం వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చదవండి...

Published : 22 Jun 2021 01:22 IST

మధు తన పిల్లలను కొంచెం వేగంగా కూడా పరుగెత్తనివ్వదు. ఎక్కడ పడిపోతారోనని ఆందోళనపడుతుంది. తల్లిగా పిల్లలకు గాయాలు తగులుతాయని భయపడటం సహజం. ఆ అనుమానమే భవిష్యత్తులో ఆ చిన్నారుల మెదడు చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ పరిశోధన ధ్రువీకరించింది. బాల్యంలో పిల్లలు చేసే వ్యాయామం వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చదవండి...

ఆలోచనాపరులుగా...
ఈ అధ్యయనం కోసం 26 నుంచి 69 ఏళ్లలోపువారిని మొత్తం 214 మందిని పరిశీలించారు. చిన్నప్పటి నుంచి శారీరక వ్యాయామాలు చేసిన వాళ్లు ఎదిగిన తర్వాత తెలివైన వారిగా, ఆలోచనాపరులుగా అయినట్టు గుర్తించారు. బాల్యంలో చిన్నారుల మెదడు వారికెదురైన అనుభవాలు, సంఘటనల నుంచి కొత్త విషయాలను నేర్చుకునే దశలో ఉంటుంది. ఆ సమయంలో గేమ్స్‌ ఆడటం, పది మందితో కలవడం, వ్యాయామాలు చేయడం వంటివి వారి మెదడు పనితీరును అభివృద్ధి చేసి, ఉత్సాహవంతులుగా మారుస్తాయి. ఆలోచనా విధానాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని, భవిష్యత్తును ఇష్టమైనట్లు తీర్చిదిద్దుకున్న వారిని చిన్నప్పుడు ఎలా ఉండేవారో అడిగి తెలుసుకున్నారు. 12 ఏళ్లలోపు వయసులో వ్యాయామం చేసిన పిల్లలు పెద్దయినతర్వాత చురుకుగా ఉన్నారట. చిన్నప్పటి నుంచి ఉత్సాహంగా ఉండే వారితో పోలిస్తే ఎదిగిన తర్వాత వ్యాయామాలు చేసిన వారిలో ఆలోచనాశక్తి శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.

క్రీడల్లో ప్రవేశం..
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎంత ముఖ్యమో, శారీరక శ్రమను అలవాటు చేయడమూ అంతే ముఖ్యం. ఉదయం, సాయంత్రం అవుట్‌డోర్‌ గేమ్స్‌, చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరి. వారికిష్టమైన క్రీడను ఎంచుకోమంటే చాలు. ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. పజిల్స్‌, మైండ్‌ గేమ్స్‌ను కూడా అలవరచాలి. వీటితో చిన్నారులు భవిష్యత్తులో దూసుకెళతారు. ఎటువంటి సమస్యలెదురైనా పరిపక్వత, ఆలోచనా విధానంతో పరిష్కరించుకోగలుగుతారు. లేదంటే చిన్నప్పటి నుంచి అధికబరువు వంటి సమస్యలు చుట్టుముడతాయి. క్రమేపీ ఇది పలురకాల అనారోగ్యాలకు కారణమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్