ప్రతికూల ఆలోచనలా?

సాధారణంగా అందరికీ ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒకోసారి ఇవి ప్రవాహంలా  ఉంటాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే...

Published : 24 Jun 2021 01:27 IST

సాధారణంగా అందరికీ ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒకోసారి ఇవి ప్రవాహంలా  ఉంటాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే...

* సానుకూలఆలోచనా విధానమే మనల్ని విజయం వైపునకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది.

* ఇతరులతో పోల్చుకోవద్దు. మీ నిన్నటి రోజును నేటితో పోల్చుకోండి. చాలు.

* గతాన్ని మార్చలేరు. కాబట్టి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి.

* స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. అందుకోసం మనసు మాట వినాలి.

* సమయ పాలన పాటించాలి. అది చాలా విలువైందని గ్రహించాలి. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ టైమ్‌కు పూర్తి చేయాలని గట్టిగా అనుకోవాలి. బద్ధకం పనికిరాదు.

* ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని వీడొద్దు.

* వైఫల్యం ఎదురుకాగానే నీరుగారి పోవద్దు. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

* ప్రతికూల ఆలోచనలు చుట్టుముడుతున్న సమయంలో చుట్టూ సానుకూలంగా ఆలోచించేవారు ఉండేలా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్