బరువునితగ్గించేస్తాయ్‌!

నోరు కట్టేసుకోవడం, విపరీతమైన శారీరక శ్రమ.. బరువు తగ్గాలనుకునేవారు  ఎంచుకునే మార్గాలివి. ఇలాచేస్తే శరీరానికి తగిన పోషకాలెలా అందుతాయి? బరువు అదుపులో ఉంచుతూనే పోషకాలు అందించే జ్యూసులివి.

Published : 27 Jun 2021 01:26 IST

నోరు కట్టేసుకోవడం, విపరీతమైన శారీరక శ్రమ.. బరువు తగ్గాలనుకునేవారు  ఎంచుకునే మార్గాలివి. ఇలాచేస్తే శరీరానికి తగిన పోషకాలెలా అందుతాయి? బరువు అదుపులో ఉంచుతూనే పోషకాలు అందించే జ్యూసులివి.

ఉసిరి: బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు పరగడుపున రోజూ తీసుకోవాలి. తేనె చేర్చుకుంటే రోజంతా ఉత్సాహంగానూ ఉండొచ్చు.

 దానిమ్మ: కొవ్వును కరిగించే, మెటబాలిజాన్ని పెంచే గుణాలెక్కువ. శరీర ఛాయని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించుకోవడంలో సాయపడుతుంది.

 క్యాబేజ్‌: కడుపుబ్బరం, అజీర్ణం వంటి ఉదర సమస్యలకు చెక్‌ పెడుతుంది. జీర్ణక్రియను వేగిరం చేయడమే కాదు, బరువు తగ్గేలా చూస్తుంది.

 ఆరెంజ్‌: కెలొరీలకు శత్రువని దీనికి పేరు. తక్కువ కెలొరీలుండడమే కాదు.. శరీరంలో కొవ్వును త్వరగా కరిగించడంలోనూ తోడ్పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్