నిమ్మతో రక్తహీనతకు చెక్‌

నిమ్మకాయ ప్రసక్తి వస్తే ‘ఏముందిలే.. పచ్చడికేగా’ అంటారు చాలా మంది. కానీ ఇదెంత మేలు చేస్తుందో తెలిస్తే మాత్రం వదలరు...

Published : 05 Jul 2021 00:41 IST

నిమ్మకాయ ప్రసక్తి వస్తే ‘ఏముందిలే.. పచ్చడికేగా’ అంటారు చాలా మంది. కానీ ఇదెంత మేలు చేస్తుందో తెలిస్తే మాత్రం వదలరు...

*  నిమ్మకాయలో సి-విటమిన్‌ అధికమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌ చర్మం ముడతలు పడకుండా, కిడ్నీలో రాళ్లేర్పడకుండా చేస్తుంది.

  రక్తహీనతతో బాధపడే మహిళలు... నిమ్మను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇందులోని విటమిన్‌ సి శరీరం ఇతర ఆహార పదార్థాల నుంచి తగినంత ఐరన్‌ని గ్రహించేలా చేస్తుంది.

*  మొలకెత్తిన గింజల్లో కాస్త నిమ్మరసం జల్లితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

*  నిమ్మ జలుబు కారకమని కొందరు దాని జోలికి పోరు. కానీ అరుచిని పోగొడుతుంది. డీహైడ్రేషన్‌ బారిన పడనీయదు.

*  ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్‌తో కారకాలతో పోరాడతాయి.  కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

* ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో అరచెక్క నిమ్మరసం కలిపి తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అధికబరువు, రక్తపోటు అదుపులో ఉంటాయి. హృద్రోగాలు వచ్చే అవకాశమూ తక్కువే.

* శరీరంలో విటమిన్‌ సి తగ్గితే కీళ్లవాతం మొదలు డిప్రెషన్‌ వరకూ అనేక అనారోగ్యాలు దాడిచేసే ప్రమాదముంది. కాబట్టి ఏదో రూపంలో నిమ్మకాయను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్