చిటపట చినుకుల మధ్య మెరిసే చర్మం..

కాలానికి తగ్గట్లుగా చర్మాన్ని పరిరక్షించుకుంటే చాలు. కొన్ని చిట్కాలతో వర్షాల్లోనూ మీ చర్మం మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు.శుభ్రంగా... రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌, కలబంద లేదా యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ను మృదువుగా అప్లై చేయాలి....

Published : 06 Jul 2021 00:36 IST

కాలానికి తగ్గట్లుగా చర్మాన్ని పరిరక్షించుకుంటే చాలు. కొన్ని చిట్కాలతో వర్షాల్లోనూ మీ చర్మం మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు.

* శుభ్రంగా... రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌, కలబంద లేదా యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ను మృదువుగా అప్లై చేయాలి.    

టోనింగ్‌...  దీని కోసం పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్‌టీ... ఏదో ఒకటి రాస్తే, మృత కణాల బెడద ఉండదు.

టాక్సిన్లను... టాక్సిన్లను బయటికి పంపడానికి ఎక్కువ మంచినీటిని తాగాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలకు అవకాశం ఉండదు. బయటి నుంచి వచ్చిన వెంటనే మేకప్‌ను తొలగించి, శుభ్రం చేసుకోవాలి.

నలుగుతో... వారానికొకసారైనా ఒంటికి కొబ్బరి నూనె రాసి పెసర లేదా సెనగ పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. రోజూ అరచెక్క నిమ్మరసాన్ని పిండిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్