ఒత్తయిన కురుల కోసం!

అమ్మాయిల నుంచి మహిళల దాకా ప్రతి ఒక్కరికీ¨ ఒత్తయిన జుట్టు కావాలని ఉంటుంది. మరి ఇది సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు కుందామా...

Published : 09 Jul 2021 00:35 IST

అమ్మాయిల నుంచి మహిళల దాకా ప్రతి ఒక్కరికీ¨ ఒత్తయిన జుట్టు కావాలని ఉంటుంది. మరి ఇది సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు కుందామా...

మీ జుట్టు పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మాడు, వెంట్రుకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు...

* దిండు గలేబులను తరచూ మార్చాలి. ఎందుకంటే జుట్టుకు ఉండే నూనె, చుండ్రు వీటిపై పడటమే కాకుండా తిరిగి మళ్లీ తలలోకే చేరే అవకాశం ఉంటుంది.

* కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును టవల్‌తో గట్టిగా దులుపుతుంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. ఇలా చేస్తే చిక్కులు పడిపోయి ఊడిపోతుంది.

* ప్రొటీన్లు ఉండే గుడ్డుతో అప్పుడప్పుడూ పూత వేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి, బాదం, జొజొబా లాంటి నూనెలతో మర్దనా చేసుకోవాలి. అప్పుడు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.

* తలస్నానం చేసేటప్పుడు షాంపూ మాత్రమే సరిపోదు. కండినర్‌ వాడాల్సిందే. ఎందుకంటే చాలా రకాల షాంపూలు మీ జుట్టులోని తేమను లాగేస్తాయి. కాబట్టి జుట్టుకు పోషణ, తేమ అందాలంటే కండిషనర్‌ కావాల్సిందే.

* జుట్టు ఒత్తుగా పెరగాలంటే పై పూతలే సరిపోవు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, పాలకూర, ఉసిరిలను తరచూ తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్