శక్తినిచ్చే ఆహారం

మన చుట్టూ కరోనా వచ్చి తగ్గిన వాళ్లున్నారు. ఇంకా కరోనా వస్తుందేమోనన్న భయంతో హడలిపోతున్న వాళ్లూ ఉన్నారు.

Published : 28 Jul 2021 02:30 IST

మన చుట్టూ కరోనా వచ్చి తగ్గిన వాళ్లున్నారు. ఇంకా కరోనా వస్తుందేమోనన్న భయంతో హడలిపోతున్న వాళ్లూ ఉన్నారు. నీరసాన్ని జయించాలన్నా, భయాన్ని అధిగమించాలన్నా బలంగా, దృఢంగా ఉండాలి. కనుక ఇప్పుడు అందరికీ కావలసింది ఇమ్యూనిటీ పెంచే పోషకాహారం. అందుకేం తింటే మంచిదో చూద్దాం...

నిమ్మ, దానిమ్మ, బత్తాయి, కమలా: వీటిలో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మిరపకాయ, క్యాప్సికమ్‌: వీటిలో ఉండే బీటా కెరొటిన్‌, ఎ, సి విటమిన్‌లు ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరచి, చర్మానికి కాంతినిస్తాయి.

వెల్లుల్లి: ఇందులోని యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలిసిన్‌ వైరస్‌లతో పోరాడుతుంది.

అల్లం: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున వైరస్‌ను శక్తివంతంగా ఎదుర్కొంటాయి.

బాదంపప్పు: రోగనిరోధక శక్తిని పెంచడంలో బాదంపప్పుది కీలకపాత్ర. ఇ-విటమిన్‌ కూడా విస్తారంగా ఉంటుంది. నేరుగా తినడం కంటే నానబెట్టి, పొట్టు తీసి తినడం శ్రేష్టం.

పసుపు: ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. పసుపు వేసి పాలను మరిగించి తాగాలి.

బొప్పాయి: ఇందులో పొటాషియం, విటమిన్‌-బి, ఫోలిక్‌ యాసిడ్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్