బాలింతకు.. బలాన్నిచ్చే ఆహారం!

బాలింతకు పెట్టే ఆహారం ఆమెకు బలాన్నిచ్చేలా, బిడ్డకు సరిపోయినన్ని పోషకాలు అందించేలా ఉండాలి.  తల్లి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే, పాల ద్వారా పోషకాలు బిడ్డకు అంది పాపాయి చక్కగా ఎదుగుతుంది

Published : 02 Aug 2021 01:22 IST

బాలింతకు పెట్టే ఆహారం ఆమెకు బలాన్నిచ్చేలా, బిడ్డకు సరిపోయినన్ని పోషకాలు అందించేలా ఉండాలి.  తల్లి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే, పాల ద్వారా పోషకాలు బిడ్డకు అంది పాపాయి చక్కగా ఎదుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బాలింతకు ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు తేలికగా జీర్ణమయ్యే, బలవర్థకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే పాలు బిడ్డకు కావలసినన్ని పడతాయి. ముఖ్యంగా శుద్ధమైన నెయ్యి ఎక్కువగా తినాలి. రోజులో మూడు నాలుగు గ్లాసుల పాలు తాగాలి. ఇవన్నీ స్తన్యం పెంచేవే. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్‌, బీట్‌రూట్‌, బెండ వంటి కూరగాయలు, బియ్యం, పెసరపప్పు వేయించి చేసిన కిచిడీ/ పులగం వంటివన్నీ ఇందుకోసం తీసుకోవచ్చు. ఆహారంలో మెంతులు, జీలకర్ర, గసగసాలు, ఇంగువ, వాము, ధనియాలు ఎక్కువగా వాడాలి. ఇవి పాలుపడేలా చేయడంతో పాటు గర్భాశయం కుంచించుకుపోవడానికి, రక్తస్రావం తగ్గడానికి, నొప్పుల నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. మలబద్ధకం లేకపోతే వెల్లుల్లిని రోజూ ఇవ్వొచ్చు. యాపిల్‌, దానిమ్మ, బొప్పాయి లాంటి పళ్లు తినొచ్చు. 

వీటికి దూరంగా...  ఆహారంలో కారం, మసాలాలు వద్దు. ఇవి తల్లిపాలు తగ్గడానికి కారణమవుతాయి. చిక్కుడు జాతి గింజలు, బఠానీలు, సెనగలు వద్దు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ కడుపులో వాయువులను పెంచుతాయి. మాంసాహారాలూ పెట్టొద్దు. పుల్లటి పెరుగు, మజ్జిగ, ఇతర పుల్లటి ఆహారాలు, ఊరగాయలు మానాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్