కాజల్‌ ఏం తింటుందో!

ముప్పై ఆరేళ్లు వచ్చినా కూడా తొలిచిత్రంలోలానే అందాలొలుకుతూ ఉంటుంది కాజల్‌! అసలు తనేం తింటుందో అన్న సందేహానికి ఇలా చెప్పుకొచ్చింది...

Published : 03 Aug 2021 01:00 IST

ముప్పై ఆరేళ్లు వచ్చినా కూడా తొలిచిత్రంలోలానే అందాలొలుకుతూ ఉంటుంది కాజల్‌! అసలు తనేం తింటుందో అన్న సందేహానికి ఇలా చెప్పుకొచ్చింది...

‘‘రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు, గంటన్నర రెండుగంటలకొకసారి చొప్పున ఏడు సార్లు డైట్‌ తీసుకుంటా. పూర్తిగా శాఖాహారిని కావడంతో నా భోజనంలో తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, రోటీ, తేనె, గ్రీన్‌టీ వంటివే ఉంటాయి. ఉదయాన్నే వర్కవుట్‌ తర్వాత కొబ్బరినీళ్లు, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీ వంటి వాటితో చేసిన స్మూతీ తింటా. అల్పాహారంలో బ్రౌన్‌ బ్రెడ్‌, ఓట్స్‌, పీనట్‌బటర్‌, సోయా ఉంటాయి. లంచ్‌లో గ్రీన్‌సలాడ్‌, పండ్లు, బ్రౌన్‌ రైస్‌, ఆకుకూరలు తప్పనిసరి. సాయంకాలం పండ్ల రసాలు, డిన్నర్‌లో వెజ్‌ సూప్‌, గ్రీన్‌సలాడ్‌ తీసుకుంటా. బయటి ఫుడ్‌కు ఆమడ దూరం. షూటింగ్‌కు వెళ్లినా అమ్మ చేతి వంటనే తింటా. ఎప్పుడైనా ఓరోజు నియమాలను పక్కన పెట్టేసి పిజ్జా, పరాటా, దోశ, ఇడ్లీ, బిరియానీ, చాక్లొట్‌కేక్‌ వంటివి లాగించేస్తా. మరుసటి రోజు ఓ అరగంట అదనంగా వ్యాయామాలు చేసి ఆ కొవ్వును కరిగించుకుంటా. పాల ఉత్పత్తులు, అన్నం, నిల్వ పదార్థాలు, జంక్‌ఫుడ్‌ని దగ్గరకు రానివ్వను’’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్