వాడేసిన నూనె పడేస్తున్నారా?

పూరీలో, గారెలో మరేవైనా పిండి వంటలో చేసినప్పుడు కొద్దిగా నూనె మిగిలిపోతుంది. దీన్ని మళ్లీ మళ్లీ వాడితేనేమో ఆరోగ్యం పాడవుతుంది. మరి ఈ నూనెను పారేయాల్సిందేనా...

Published : 06 Aug 2021 01:36 IST

పూరీలో, గారెలో మరేవైనా పిండి వంటలో చేసినప్పుడు కొద్దిగా నూనె మిగిలిపోతుంది. దీన్ని మళ్లీ మళ్లీ వాడితేనేమో ఆరోగ్యం పాడవుతుంది. మరి ఈ నూనెను పారేయాల్సిందేనా...

నూనెను వడకట్టి ఓ సీసాలో పోసి పెట్టుకోండి. గొళ్లెం, బోల్టులు, తాళాల్లో రెండు మూడు చుక్కలు వేయడమో, లేదా ఈ నూనెతో తుడవడమో చేస్తే అవి బిగుతుగా మారవు. సులువుగా వదులవుతాయి. వాటిని వాడేటప్పుడు  శబ్దాలు రావు. తుప్పు పట్టవు కూడా.

* కరెంటు పోయినప్పుడు మట్టి ప్రమిదల్లో ఈ నూనె పోసి దీపాలు వెలిగించుకోవచ్చు. క్యాండిల్స్‌ కొనక్కర్లేదు.

* ఈ కాలంలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు కాగితానికి ఈ నూనె రాసి పురుగులు వచ్చే చోట వేలాడదీస్తే దానికి అతుక్కుంటాయి. తెల్లారాక ఆ కాగితాన్ని పారేస్తే సరి.

* ఈ నూనెలో కొద్దిగా వెనిగర్‌ కలిపి కలప ఫర్నిచర్‌ను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. 

* లెదర్‌తో చేసిన బ్యాగులు, ఇతర వస్తువులను ఈ నూనెతో తుడిస్తే మరింత మృదువుగా మారడమే కాకుండా కాంతులీనుతాయి.

* గోడలపై పెయింట్‌ మరకలను పొగొట్టాలంటే ఈ నూనెలో పాత వస్త్రాన్ని ముంచి రుద్దితే సరి.

* ఈ నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి కాసేపయ్యాక షాంపూ, కండిషనర్‌తో శుభ్రం చేసుకుంటే జుట్టు పట్టులా మారుతుంది.

* కొత్తగా తెచ్చిన ఇనుము, ఇత్తడి లాంటి సామగ్రికి ఈ నూనె రాసి తోమితే చక్కగా శుభ్రపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్