నెలసరి క్రమం తప్పుతోందా?

కొందరిలో నెలా నెలా ఠంచనుగా వచ్చే రుతుచక్రం ఒక్కోసారి ముందుగానే వచ్చేయడమో లేదా మరీ ఆలస్యంగా రావడమో జరుగుతుంది. ఇలా అవడానికి కారణాలేంటంటే... గర్భం... ధరించిన మహిళల్లో నెలసరి ఆగిపోవడం మొదటి సంకేతం....

Published : 12 Aug 2021 00:18 IST

కొందరిలో నెలా నెలా ఠంచనుగా వచ్చే రుతుచక్రం ఒక్కోసారి ముందుగానే వచ్చేయడమో లేదా మరీ ఆలస్యంగా రావడమో జరుగుతుంది. ఇలా అవడానికి కారణాలేంటంటే...

గర్భం... ధరించిన మహిళల్లో నెలసరి ఆగిపోవడం మొదటి సంకేతం.

మాత్రలు: గర్భనిరోధక మాత్రలు వాడినప్పుడు కూడా అప్పుడప్పుడూ నెలసరి అదుపు తప్పుతుంది.

పాలిచ్చే తల్లులు: బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కూడా నెలసరి చాలా రోజుల పాటు ఆగిపోతుంది. బిడ్డ ఎప్పుడైతే పాలు తాగడం ఆపేస్తాడో అప్పుడే నెలసరి మొదలవుతుంది.

అనారోగ్యాలు:  థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కూడా ఇది ఆలస్యంగా లేదా తొందరగా రావడం జరుగుతుంది. పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌), మూత్రాశయంలో రాళ్లు, బుడగల్లాంటివి ఉండటం, ఎండోమెట్రియాసిస్‌ లాంటి అనారోగ్యాల వల్ల క్రమం తప్పుతుంది.

ఒత్తిడి: ...వల్ల కూడా అండం విడుదల అవదు. దాంతో నెలసరి మొదలు కాదు.

మెనోపాజ్‌: సాధారణంగా 45, 50 ఏళ్లు వచ్చే సరికి మెనోపాజ్‌ మొదలవుతుంది. కొందరిలో అటూ ఇటూ ఉండొచ్చు. ఇది మొదలవుతున్నప్పుడు కూడా నెలసరి క్రమం తప్పుతుంది.

బరువు: అకస్మాత్తుగా బరువు పెరగడం/ తగ్గడం కూడా నెలసరి మీద ప్రభావాన్ని చూపుతుంది.

వ్యాయామాలు: మితి మీరిన వ్యాయామాల వల్ల కూడా పీరియడ్స్‌ ఆర్డర్‌ మారొచ్చు.

మందులు: అనారోగ్యాలకు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా నెలసరి ఆలస్యంగా రావడమో, ముందు వచ్చేయడమో జరుగుతుంది.

వీటిలో మీకేది వర్తిస్తుందో చూడండి. అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్