బరువు తగ్గాలంటే... తిండి మానేయాలా!

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనక్కర్లేదు. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు వద్దే వద్దు.. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ బరువును నియంత్రణలో పెట్టుకోవచ్చు

Updated : 16 Sep 2022 10:56 IST

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనక్కర్లేదు. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు వద్దే వద్దు.. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ బరువును నియంత్రణలో పెట్టుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

నీళ్లు.... తగినంత నీటిని తాగకపోవడం వల్ల రోగనిరోధకత తగ్గిపోతుంది. దాంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బరువూ నియంత్రణలో ఉంటుంది.

కొద్దికొద్దిగా... ఎక్కువసార్లు... చాలా మంది మహిళలు ఆహారం మిగిలిపోతుందనో లేదా పాడవుతుందనో, ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల తెలియకుండానే క్రమక్రమంగా బరువు పెరుగుతారు. మిగిలితే మరో రకంగా ఉపయోగించండి. మీరు మాత్రం మితంగా రోజులో నాలుగైదుసార్లు ఆహారం తీసుకోండి.

బెల్లం.. తేనె!... ఆరోగ్యంతోపాటు బరువు నియంత్రణలో ఉండాలంటే చక్కెరను వదిలేయాలి. ప్రత్యామ్నాయంగా బెల్లం/తేనెలను వాడచ్చు. ఇవి రుచిని ఇస్తాయి. కెలొరీలను తగ్గించి బరువునూ నియంత్రణలో ఉంచుతాయి.

జంక్‌ వద్దు... బేకరీ, నూనెలో వేయించిన పదార్థాలను దూరం పెట్టండి. బదులుగా తాజా సలాడ్లకు ప్రాధాన్యం ఇవ్వండి. వీటితో ఆరోగ్యంతోపాటు మెరిసే మేనూ మీ సొంతమవుతుంది.

వ్యాయామం తప్పనిసరి.. భారమైన, కఠిన వ్యాయామాలకు బదులు యోగా, నడక లాంటివి రోజూ ఓ అరగంటన్నా చేయండి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

సరిపడా నిద్ర... ప్రస్తుత గజిబిజి  జీవితంలో చాలామంది నిద్ర విషయంలో రాజీ పడుతున్నారు. ఇలా చేస్తే అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. బరువూ పెరుగుతారు. కాబట్టి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. మంచి నిద్రతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్