టెడ్డీబేర్‌ మురికిగా ఉంటే...

ఏడాదిన్నర వయసున్న తన కూతురు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటే రాధకు ఆందోళనగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకలా అవుతోందో అర్థం కావడం లేదామెకు. చిన్నారులెదుర్కొనే కొన్ని అనారోగ్యాలకు వారు ఆడుకునే బొమ్మలు కూడా కారణమవుతాయంటున్నారు వైద్యులు. అదెలానో, నివారణ ఏంటో చూడండి...

Published : 14 Aug 2021 00:36 IST

ఏడాదిన్నర వయసున్న తన కూతురు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటే రాధకు ఆందోళనగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకలా అవుతోందో అర్థం కావడం లేదామెకు. చిన్నారులెదుర్కొనే కొన్ని అనారోగ్యాలకు వారు ఆడుకునే బొమ్మలు కూడా కారణమవుతాయంటున్నారు వైద్యులు. అదెలానో, నివారణ ఏంటో చూడండి...

ష్టమైన బొమ్మలను నిరంతరం చేతిలోనే ఉంచుకోవడం పిల్లలకు అలవాటు. టెడ్డీబేర్‌, బార్బీ వంటివైతే నిద్రపోయేటప్పుడూ పక్కనే ఉండాలని మారాం చేస్తారు. అయితే వాటిపై పేరుకునే మురికి ఎలర్జీ, జ్వరం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. అందుకే ఈ బొమ్మలను తరచూ శుభ్రపరచడమే సరైన పరిష్కారం అని సూచిస్తున్నారు.

* పరిశీలించాలి..  మొదట ఆ బొమ్మల లేబుల్‌ను పరిశీలించి, వాటిని శుభ్రపరిచే విధానాన్ని తెలుసుకోవాలి. కొన్నింటిని సాధారణ సబ్బు నీళ్లతో వాష్‌ చేయొచ్చు. అటువంటి వాటిని సర్ఫ్‌ నీటిలో నానబెట్టి ఉతికి, మంచి నీటిలో జాడించి ఆరబెడితే చాలు. మరికొన్నింటికి గోరువెచ్చని లేదా చన్నీళ్లతో ప్రత్యేక పద్ధతిలో శుభ్రపరచాల్సి ఉంటుంది. ఆ విధంగానే చేయాలి. కొన్ని బొమ్మలను నీటిలో తడపకూడదు. కేవలం బ్రష్‌తో మురికిని పోగొట్టాల్సి ఉంటుంది.  

కొన్ని రకాలను వాషింగ్‌ మిషన్‌లోనూ శుభ్రపరిచే అవకాశం ఉంటుంది. అలాగని వాటిని నేరుగా మిషన్‌లో వేయకూడదు. లాండ్రీ బ్యాగు లేదా తలగడ కవరులో బొమ్మను ప్యాక్‌ చేయాలి. ఆ తర్వాతే వాషింగ్‌ మిషన్‌లో వేస్తే, ఆ బొమ్మ పాడవకుండా, మురికి మాత్రమే వదులుతుంది. ఉతకడం అయిపోయిన తర్వాత నీడలో ఆరబెడితే చాలు.

ప్లాస్టిక్‌ బొమ్మలనైతే కనీసం వారానికి ఒకసారైనా సబ్బునీటిలో ఓ అరగంట నాన బెట్టాలి. మురికి పోయేలా మృదువుగా బ్రష్‌ చేసి, మంచి నీటిలో కడిగి ఆరబెట్టాలి. చిన్నారులకు బొమ్మలను ఎంపిక చేసేటప్పుడు నాణ్యతకు పెద్దపీట వేయడం మరవకూడదు. అప్పుడే వాటివల్ల బుజ్జాయిల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్