బరువు పెరిగితే...

పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత సులభం కాదు. వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో దాన్ని నియంత్రించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించండి...

Published : 16 Aug 2021 01:11 IST

పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత సులభం కాదు. వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో దాన్ని నియంత్రించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించండి...

పోషకాహారం... వ్యాయామం... ఈ రెండింటి వల్లే బరువు తగ్గుతాం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే కొవ్వు కరుగుతుంది.

ఉప్పు... మోతాదుకు మించితే శరీరంలో నీరు రూపంలో అధికంగా నిల్వ ఉంటుంది. శరీరాకృతి మారిపోతుంది.

ఎలక్ట్రోలైట్స్‌... క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు శరీరానికి శక్తినిచ్చే ఎలక్ట్రోలైట్స్‌. అరటిపండ్లు, పెరుగు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ అందుతాయి.

కార్బొహైడ్రేట్లు మితంగా... పిండి పదార్థాలు శరీరంలో గ్లైకోజెన్‌గా మారతాయి. నీటితో కలిసి కాలేయం, కండరాల్లో నిల్వ ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరంలో నీటినిల్వలు అధికమవుతాయి. అందుకే కార్బొహైడ్రేట్స్‌ మోతాదు మించొద్దు.

ప్రొటీన్‌, ఫైబర్‌ దండిగా..

బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో మాంసకృత్తులు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఇవి బరువును నియంత్రిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్