కాజల్‌ ఫిట్‌నెస్‌ రహస్యమిదే...

రోజూ చేసే సూర్య నమస్కారాలే తన ఫిట్‌నెస్‌ రహస్యమని చెబుతోంది అందాల నటి కాజల్‌ అగర్వాల్‌. వారంలో మూడు రోజులు యోగా చేసే అలవాటు తనను ఒత్తిడి నుంచి దూరం

Published : 17 Aug 2021 01:43 IST

రోజూ చేసే సూర్య నమస్కారాలే తన ఫిట్‌నెస్‌ రహస్యమని చెబుతోంది అందాల నటి కాజల్‌ అగర్వాల్‌. వారంలో మూడు రోజులు యోగా చేసే అలవాటు తనను ఒత్తిడి నుంచి దూరం చేస్తోందంటోంది. ‘‘రోజూ చేసే అరగంట వ్యాయామం వల్ల కండరాలన్నీ పనిచేసి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీన్ని ప్రతి  ఒక్కరూ పాటించొచ్చు. శరీరంలోని అవయవాలన్నింటి కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఎంపిక చేసి వర్కవుట్స్‌ చేస్తే నిండైన ఆరోగ్యం సొంతమవుతుంది. నేనూ ఇవే పాటిస్తా. వారానికి ఒకసారి 45 నిమిషాలు గుండెకు సంబంధించి, ఓ గంట ఎముకలు పటిష్టంగా ఉండటానికి ఎక్సర్‌ సైజులు తప్పనిసరి. ఫిట్‌నెస్‌ పేరుతో శరీరాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురిచేసే అలవాటు నాకు లేదు. సాధారణంగా కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలైన చేతులు, పొత్తికడుపు, ఛాతీ, నడుముకు సంబంధించిన వ్యాయామాలకు ప్రాధాన్యతనిస్తా. రోజూ కనీసం గంటసేపు ఈతకొట్టే అలవాటు నా శరీరసౌష్టవాన్ని కాపాడుతోంది. అదనపు కెలోరీలను కరిగించడం కోసం డ్యాన్స్‌ అలవాటు చేసుకున్నా. వీటితోపాటు ఏడు గంటల నిద్ర నన్ను తెల్లవారేసరికి తాజాగా ఉంచుతుంది.’’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్