బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..పోషకాహారం... వ్యాయామం...  ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక  వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.

Updated : 16 Sep 2022 10:59 IST

పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..

పోషకాహారం... వ్యాయామం...  ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక  వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.

ఉప్పు... ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో అధికంగా నీరు రూపంలో నిల్వ ఉంటుంది. దాంతో శరీర ఆకృతి మారిపోతుంది. అందుకే ఉప్పు వాడకం తగ్గించాలి.

ఎలక్ట్రోలైట్స్‌... క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు శరీరానికి శక్తినిచ్చే ఎలక్ట్రోలైట్స్‌. వీటిని తగిన పరిమాణంలో తీసుకోవాలి. అరటిపండ్లు, పెరుగు, ఆకుకూరలనుంచి ఎలక్ట్రోలైట్స్‌ అందుతాయి.

కార్బొహైడ్రేట్లు... పిండి పదార్థాలు శరీరంలో గ్లైకోజెన్‌గా మారతాయి. ఇవి నీటితో కలిసి కాలేయం, కండరాల్లో నిల్వ ఉంటాయి. పిండిపదార్థాలు ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా నీటి నిల్వలు శరీరంలో ఉంటాయి. కాబట్టి కార్బొహైడ్రేట్స్‌ మోతాదు మించనీయవద్ద్దు.

ప్రొటీన్‌, ఫైబర్‌... బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో మాంసకృత్తులు, పీచు ఎక్కువగా ఉండేవి ఎంచుకోవాలి. వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఇవి బరువును నియంత్రిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్