డ్యాన్సూ ఆరోగ్యమే!

పాట వినగానే పాదాలనూ సంగీతానికి అనుగుణంగా కదిలిస్తాం. డ్యాన్స్‌  ఏ వయసులోనైనా ఎవరైనా చేయొచ్చు. దీనికి ఆడా, మగా తేడా లేదు. 

Published : 23 Aug 2021 01:40 IST

పాట వినగానే పాదాలనూ సంగీతానికి అనుగుణంగా కదిలిస్తాం. డ్యాన్స్‌  ఏ వయసులోనైనా ఎవరైనా చేయొచ్చు. దీనికి ఆడా, మగా తేడా లేదు. పైగా ఇలా చేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి. అవేంటంటే..

* బరువును నియంత్రిస్తుంది... డ్యాన్స్‌ ఆనందాన్ని ఇవ్వడంతోపాటు కెలొరీలనూ ఖర్చు చేస్తుంది. గంట డ్యాన్స్‌ చేయడం వల్ల ఓ వ్యక్తి దాదాపు 300 నుంచి 800 కెలొరీలు ఖర్చు చేయగలుగుతాడు.

* శరీరం విల్లులా.. డ్యాన్స్‌ వల్ల కండరాలు, నాడులన్నీ సహజసిద్ధంగా సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీంతో కీళ్లు, కండరాల నొప్పులు మిమ్మల్ని బాధించవు. అలాగే శరీరం విల్లులా సాగే గుణాన్ని పొందుతుంది.

* మెదడుకూ వ్యాయామమే..  డ్యాన్స్‌ మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరపు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. విభిన్నమైన కదలికలను నేర్చుకోవడం, వాటిని ఓ క్రమ పద్ధతిలో చేయడం... ఇవన్నీ మెదడుకూ పని కల్పిస్తాయి.

* ఒత్తిడి తగ్గిస్తుంది..  ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు సంగీతానికి అనుగుణంగా నాలుగు అడుగులు వేయండి.  మీ మూడ్‌ ఇట్టే మారిపోతుంది. ఒత్తిడి హాంఫట్‌ అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్