నెలసరికి.. హార్మోన్లకి ఏంటి సంబంధం?

నెలసరి సరిగా రాకపోవడం, సంతానలేమి, జుట్టు రాలడం, దాంపత్య జీవితం పట్ల విముఖత... ఇలా అనేక సమస్యలకు హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణం.

Updated : 23 Aug 2021 01:51 IST

నెలసరి సరిగా రాకపోవడం, సంతానలేమి, జుట్టు రాలడం, దాంపత్య జీవితం పట్ల విముఖత... ఇలా అనేక సమస్యలకు హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణం. అందుకే హార్మోన్ల గురించి అవగాహన పెంచుకుందాం...

ఇవీ లక్షణాలు: పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి.. ఈ రెండూ హార్మోన్ల అసమతుల్యతకి ముఖ్య కారణాలు. అయితే హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం... లేకపోతే మందగించడం జరిగినప్పుడు సంతానలేమి, పీసీఓడీ, ఆందోళన, జననేంద్రియాల దగ్గర పొడిబారడం, దాంపత్య జీవితం పట్ల విముఖత, మూడ్‌స్వింగ్స్‌, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట, మొటిమలు, యాక్నె లాంటివి తలెత్తుతాయి.

ఎందుకిలా?:  విటమిన్‌ డి3 తగ్గితే శరీరం హార్మోన్లని చురుగ్గా తయారుచేసుకోలేదు. సూక్ష్మపోషకాలైన జింక్‌, మెగ్నీషియమ్‌, సెలీనియమ్‌, బీ6 వంటివి తగ్గినా, ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం వల్ల కూడా కార్టిసాల్‌ హార్మోన్‌ విడుదల తగ్గి జీవక్రియలని చురుగ్గా ఉంచే హార్మోన్లు పుష్కలంగా విడుదలవుతాయి.

ఇవి తినాలి:  సల్ఫర్‌ ఉండే క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌లను తీసుకుంటే కాలేయంలోని మలినాలు బయటకుపోతాయి, ఈస్ట్రోజెన్‌ పని తీరు బాగుంటుంది. 

వీటికి దూరంగా: కాస్మెటిక్స్‌, డిటర్జెంట్లు, ఫ్లోర్‌ క్లీనర్లు, పెర్‌ఫ్యూమ్‌లు, నాన్‌స్టిక్‌ల వంటివి ఈస్ట్రోజెన్‌ హార్మోను ఎక్కువగా విడుదలవడానికి కారణమవుతాయి. ప్రత్యామ్నాయంగా స్టీలు, గ్లాసు, మట్టిపాత్రలు, సేంద్రియంగా పండించిన పండ్లు, కాయగూరలను ఎంచుకుంటే మంచిది.

ఆ పాలు మంచివేనా..: గేదెలు, ఆవులకు హార్మోన్‌ ఇంజెక్షన్లను ఇవ్వడం తెలిసిందే. వాటి నుంచి తీసిన పాలు కూడా మనలో హార్మోన్ల అసమతుల్యతకి కారణమవ్వొచ్చు. వీలైనంత వరకు హార్మోన్‌రహిత పాలకు  ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రకృతి వరం: హార్మోన్ల అసమతుల్యతని సహజ పద్ధతుల్లో సరైన మార్గంలో పెట్టే ఆహారం ఉంది. అశ్వగంధ, తులసి వంటివి హార్మోన్ల సమస్యలు రాకుండా చూస్తాయి. లావెండర్‌, చందనం, థైమ్‌ నూనెలు హార్మోన్లు సరిగా విడుదలయ్యేలా చేస్తాయి. మెనోపాజ్‌ సమయంలో చికాకుల నుంచి ఉపశమనం లభించడానికి ఈ నూనెలు దోహదం చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్