ఈ ఆసనాలతో అందం... ఆరోగ్యం!

రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడవాలా... మనసు ప్రశాంతంగా ఉండాలా... మేను మెరిసిపోవాలా...  ఆరోగ్యమూ కావాలంటారా... అయితే ఉదయం లేవగానే ఈ యోగాసనాలు వేయడానికి ప్రయత్నించండి. అన్నీ మీ సొంతమవుతాయి.

Published : 30 Aug 2021 00:22 IST

రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడవాలా... మనసు ప్రశాంతంగా ఉండాలా... మేను మెరిసిపోవాలా...  ఆరోగ్యమూ కావాలంటారా... అయితే ఉదయం లేవగానే ఈ యోగాసనాలు వేయడానికి ప్రయత్నించండి. అన్నీ మీ సొంతమవుతాయి.

ధ్యానం: ఐదు నిమిషాలపాటు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. ఇలా రోజూ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.

చైల్డ్‌ పోజ్‌: మ్యాట్‌పై మోకాళ్లను మడిచి పాదాలు పిరుదులను తాకేలా కూర్చోవాలి. ముందుకు వంగి చేతులు, తలను భూమికి తాకిస్తూ గాలి పీల్చుకోవాలి. ఈ స్థితిలో మీరు ఉండగలిగనంత సేపు ఉండాలి. ఆ తర్వాత పైకి లేచే క్రమంలో గాలిని బయటకు వదలాలి. ఇలా కనీసం అయిదు నుంచి పదిసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది. చర్మం కాంతులీనుతుంది.

క్యాట్‌ కౌ... రెండు కాళ్లను మోకాలి వరకు మడవాలి. చేతులను నిటారుగా ఉంచి భూమికి తాకించాలి. కిందకు చూస్తూ గాలి పీలుస్తూ, పొట్టను లోపలివైపునకు లాగాలి.  ఇప్పుడు గాలి వదులుతూ తలను పైకి లేపాలి ఇలా ఇరవై సార్లు చేయాలి.

ఈ ఆసనం వేయడం వల్ల మెడ, భుజాలు, వెన్ను కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. నాడులు ఉత్తేజంగా మారతాయి. చాలాసేపు కూర్చొని పనిచేసేవారు దీన్ని ప్రయత్నిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్