శక్తినిచ్చే ప్రొటీన్‌!

శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సింది ప్రొటీనే. ఇది చర్మ కణాలను మరమ్మతు చేసి కొత్తవాటిలా తయారుచేస్తుంది. మరి ఈ ప్రొటీన్‌ ఉండే పదార్థాలేంటో చూద్దామా..

Published : 03 Sep 2021 02:57 IST

శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సింది ప్రొటీనే. ఇది చర్మ కణాలను మరమ్మతు చేసి కొత్తవాటిలా తయారుచేస్తుంది. మరి ఈ ప్రొటీన్‌ ఉండే పదార్థాలేంటో చూద్దామా..

ప్పు గింజల్లో మాంసకృత్తులు మెండుగా ఉంటాయి. కప్పు బొబ్బర్ల నుంచి దాదాపు 17 గ్రా. ప్రొటీన్‌ లభ్యమవుతుంది.  కప్పు సోయా పాలు ఏడు గ్రాముల ప్రొటీన్లను అందిస్తాయి.

* వాల్‌నట్స్‌, బాదం, కాజూలలో కూడా పెద్ద మొత్తంలో ఈ పోషకం ఉంటుంది. అంతేకాదు వీటిలో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌- ఎ, బి మెండుగా ఉంటాయి.

* జామ, పనస, అవకాడో పండ్లలోనూ ఇది ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి మరి. పాల పదార్థాలైన పెరుగు, చీజ్‌లలో కూడా ప్రొటీన్‌ తగిన మొత్తంలో కనిపిస్తుంది.  సూపర్‌ ఫుడ్‌గా పిలిచే చియా విత్తనాల నుంచి కూడా తగుపాళ్లలో ప్రొటీన్‌ దొరుకుతుంది. అంతేకాదు వీటిలో అమైనో ఆమ్లాలు తగిన పరిమాణంలో ఉంటాయి.

* ఓట్స్‌ అధిక మొత్తంలో ప్రొటీన్‌తోపాటు పీచును కలిగి ఉంటాయి. దాంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కప్పు ఓట్స్‌ నుంచి దాదాపు ఆరు గ్రాముల మాంసకృత్తులు అందుతాయి.

* మొలకల్లో ప్రొటీన్‌ ఎక్కువ మొత్తంలో దాగి ఉంటుంది. ఈ పోషకాలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్‌ దొరకడంతోపాటు జీవక్రియలూ మెరుగుపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్