దాపరికం దేనికి?

ఎవరికీ చెప్పకోలేం.. అలాగని భరించనూలేం. కానీ ఎన్ని రోజులని ఈ సమస్యని గోప్యంగానే ఉంచుకొనే ప్రయత్నం చేస్తారు? అవును ప్రతి పది మందిలో ఎనిమిది మంది మహిళలు జననేంద్రియాల ఇన్‌ఫెక్షన్లని నిర్లక్ష్యం చేస్తున్నవారే....

Published : 06 Sep 2021 01:21 IST

వరికీ చెప్పకోలేం.. అలాగని భరించనూలేం. కానీ ఎన్ని రోజులని ఈ సమస్యని గోప్యంగానే ఉంచుకొనే ప్రయత్నం చేస్తారు? అవును ప్రతి పది మందిలో ఎనిమిది మంది మహిళలు జననేంద్రియాల ఇన్‌ఫెక్షన్లని నిర్లక్ష్యం చేస్తున్నవారే అని అధ్యయనాలు చెబుతున్నాయి... శరీరంలో ప్రతి అవయవమూ కీలకమే అని తెలిసినా కొన్నింటి పట్ల నిర్లక్ష్యం వహిస్తాం. ముఖ్యంగా జననేంద్రియాలకు వచ్చే సమస్యల గురించి బయటకు చెప్పడానికి బిడియపడతాం. దీనికి తోడు మనదేశంలో నూటికి 80శాతం స్త్రీలు పరిశుభ్రత విషయంలో  నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. దీని ఫలితంగా పదిలో ఎనిమిదిమందిపై వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో దురద, దద్దుర్లు, అసౌకర్యం వంటివి కలుగుతున్నాయంటే దానర్థం అక్కడ పీహెచ్‌ స్థాయులు మారుతున్నాయని. దీన్నుంచి ఉపశమనానికి తక్షణ వైద్య సాయం అవసరం. మనవంతుగా పాటించాల్సిన జాగ్రత్తలూ కొన్నున్నాయి. మూత్రానికి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి. తడి లేకుండా జాగ్రత్తపడాలి. సింథటిక్‌ దుస్తుల్ని కాకుండా... కాటన్‌ బ్లెండ్‌ చేసిన లోదుస్తులని మాత్రమే ధరించాలి. అలాగే సమతులాహారం తీసుకోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లని ఎదురించగలుగుతాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్