కంటికి నాలుగు 20లు

మహిళలు గంటలకొద్దీ కార్యాలయంలో లేదా వర్క్‌ ఫ్రం హోం పేరిట కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ముందు పనిచేస్తున్నారు. వీటి ప్రభావం కంటిపై పడే ప్రమాదం ఉందంటున్నారు నేత్ర నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారంగా

Published : 07 Sep 2021 00:39 IST

మహిళలు గంటలకొద్దీ కార్యాలయంలో లేదా వర్క్‌ ఫ్రం హోం పేరిట కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ముందు పనిచేస్తున్నారు. వీటి ప్రభావం కంటిపై పడే ప్రమాదం ఉందంటున్నారు నేత్ర నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారంగా 20-20-20-20 సూత్రాన్ని పాటించాల్సిందే అంటూ సూచిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం.

లక్ట్రానిక్‌ డివైస్‌ల వాడకం పెరగడంతో వీటి కిరణాల ప్రభావం రెటీనాపై పడి, పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్నుంచి తప్పించుకోవాలంటే 20-20- 20 - 20 సూత్రం ఉత్తమమైంది. కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి 20 సెకన్లకు ఒకసారి రెప్పలను మూసి తెరవాలి. దీనివల్ల కంటిలోని తేమ ఆరిపోదు. లేదంటే కళ్లు పొడారిపోతాయి. ప్రతి 20 నిమిషాలకొకసారి చిన్న విరామం తీసుకోవడం మర్చిపోకూడదు. కూర్చున్న చోటు నుంచి లేచి నుంచుని నాలుగడుగులు వేసి వచ్చి ఆ తర్వాత తిరిగి పని మొదలుపెట్టాలి. పని చేసే డివైస్‌కు కనీసం 20 అంగుళాల దూరంలో కూర్చోవాలి. దీంతోపాటు ప్రతి గంటకు 20 సెకన్లపాటు కళ్లను పూర్తిగా మూసి ఉంచితే, కంటిపై ఒత్తిడి తగ్గి, అక్కడి కండరాలు విశ్రాంతి పొందుతాయి. అలాగే కంటివద్ద ఉండే నీటి గ్రంథుల నుంచి తేమ ఆవిరి కాదు. ఈ సూత్రాల్ని పాటిస్తే నేత్ర సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్