బరువు తగ్గాలా...

చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో మీరూ ఒకరా... అయితే వీటిని కూడా ప్రయత్నించి చూడండి మరి. ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారాన్ని అస్సలు స్కిప్‌ చేయొద్దు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Published : 18 Sep 2021 01:35 IST

చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో మీరూ ఒకరా... అయితే వీటిని కూడా ప్రయత్నించి చూడండి మరి.

ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారాన్ని అస్సలు స్కిప్‌ చేయొద్దు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  పాలు, గుడ్లు, చిరుధాన్యాలు, పండ్లు మొలకలు లాంటివి తీసుకోవచ్చు.  

బరువు తగ్గాలనుకోగానే సరిపోదు. అందుకు అనుగుణంగా మన జీవనశైలినీ మార్చుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం, నడక లాంటివాటిని మన దినసరి ప్రణాళికలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో పోషకాలన్నీ ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజు మొత్తం తీసుకునే ఆహారంలో ఇది ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి.

ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆకలైనప్పుడు మాత్రమే తినాలి. అలాగే రోజులో దాదాపు ఏడెనిమిది గంటలు కంటినిండా నిద్ర పోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్