అమ్మపాలలో యాంటీబాడీల అద్భుతం!  

అమ్మపాలు అమృతంతో సమానం అంటారు. మరి అటువంటి పాలకు కొవిడ్‌కి కారణమయ్యే వైరస్‌ని ఎదిరించే శక్తి ఉందా? ఈ విషయంపై అమెరికాలోని రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనవేత్తలు పరిశోధనలు చేశారు.

Updated : 16 Nov 2021 05:43 IST

అమ్మపాలు అమృతంతో సమానం అంటారు. మరి అటువంటి పాలకు కొవిడ్‌కి కారణమయ్యే వైరస్‌ని ఎదిరించే శక్తి ఉందా? ఈ విషయంపై అమెరికాలోని రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనవేత్తలు పరిశోధనలు చేశారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడి కోలుకున్న, వాక్సినేషన్‌ చేయించుకున్న బాలింతలని ఈ పరిశోధనల కోసం ఎంచుకున్నారు. వీళ్ల నుంచీ  సేకరించిన పాలల్లో కొవిడ్‌ని ఎదిరించే యాంటీ బాడీలు పుష్కలంగా ఉన్నట్టు ఈ పరిశోధనలు తేల్చాయి. వ్యాధి నుంచి కోలుకున్న బాలింతల పాలల్లో చాలా శక్తిమంతమైన యాంటీబాడీలున్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ అవసరం లేకుండా ఈ పాల రక్షణ మాత్రమే పిల్లలకు సరిపోతుందా అనే  విషయాన్ని ఈ పరిశోధనలు తేల్చలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్