నిల్వపచ్చళ్లు తింటే...

ప్రాంతం, రుతువు మారినప్పుడు లేదా జన్యుపరంగా బాధించే పార్శనొప్పి నుంచి ఉపశమనం పొందే కొన్ని అంశాలను చెబుతోంది అమెరికాకు చెందిన మైగ్రేన్‌ రిసెర్చి ఫౌండేషన్‌. అవేంటో తెలుసుకుందాం. కాఫీ, టీ... కెఫిన్‌ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల కారణంగా పార్శనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాఫీ, టీ, చాక్లెట్‌ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. పార్శనొప్పి మొదలైన కొంత

Published : 09 Feb 2022 01:00 IST

ప్రాంతం, రుతువు మారినప్పుడు లేదా జన్యుపరంగా బాధించే పార్శనొప్పి నుంచి ఉపశమనం పొందే కొన్ని అంశాలను చెబుతోంది అమెరికాకు చెందిన మైగ్రేన్‌ రిసెర్చి ఫౌండేషన్‌. అవేంటో తెలుసుకుందాం.

కాఫీ, టీ... కెఫిన్‌ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల కారణంగా పార్శనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాఫీ, టీ, చాక్లెట్‌ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. పార్శనొప్పి మొదలైన కొంత సమయానికి తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ మొదలై తీవ్రంగా బాధిస్తుంటుంది. ఇటువంటి సమయంలో ఈ ఆహారాలు తీసుకోకుండా ఉంటే కాస్తంత ఉపశమనం పొందొచ్చు. అలాగే చక్కెరకు ప్రత్యామ్నాయాలతో తయారయ్యే స్వీట్లు తీసుకోవడం పార్శనొప్పి బాధితులకు అంత మంచిది కాదు. ఇవి నొప్పిని మరింత పెరిగేలా చేస్తాయట. వెన్న..పచ్చళ్లకు... నిర్ణీత సమయాన్ని దాటి నిల్వ ఉంచిన మాంసంతో తయారయ్యే ఆహారపదార్థాలు పార్శనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. వీటిని నిల్వ ఉంచడానికి వినియోగించే నైట్రేట్లు, రంగుల నుంచి నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తంలోకి విడుదల అవుతుంది. ఇది ఈ నొప్పిని పెంచుతుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వెన్నకు కూడా దూరంగా ఉండాలట. ఇందులోని రసాయనాల కారణంగా తలనొప్పి మరింత పెరుగుతుంది. అలాగే నిల్వ ఉంచిన పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారపదార్థాలు, ఐస్‌క్రీం వంటి గడ్డకట్టిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉప్పు తక్కువగా వినియోగించడం అలవరుచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్