కాస్త కొవ్వు తినండి

లావు తగ్గాలి, బరువు పెరగకూడదు.. వీటిలో ఏ నియమమైనా మన అమ్మాయిలు ముందు కొవ్వు పదార్థాలను దూరం పెట్టేస్తారు. కానీ ఇది అనారోగ్యానికి దారి తీయొచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

Published : 14 Mar 2022 01:55 IST

లావు తగ్గాలి, బరువు పెరగకూడదు.. వీటిలో ఏ నియమమైనా మన అమ్మాయిలు ముందు కొవ్వు పదార్థాలను దూరం పెట్టేస్తారు. కానీ ఇది అనారోగ్యానికి దారి తీయొచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

* కొవ్వుల్లో మంచి, చెడు రెండు రకాలుంటాయి. చెడువి అనారోగ్యానికి కారణమైతే.. మంచివి ఆరోగ్యాన్ని అందిస్తాయి. శరీరంలోని ప్రధాన భాగాల పనితీరు సక్రమంగా సాగాలంటే మంచి కొవ్వు అవసరం. ఇది ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణలో సాయపడుతుంది. మెదడు అభివృద్ధిలోనూ దీనిది ప్రధాన పాత్రే.

* మెనోపాజ్‌ దశలో ఉన్నవారిలో చాలామందికి  నిద్ర కరవవుతుంటుంది! శరీరంలో ఫ్యాటీయాసిడ్ల స్థాయులు తగ్గడమూ అందుకు కారణమేనట. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ను ఇవే ఉత్పత్తి చేస్తాయి.

* చర్మం ఆరోగ్యంగా ఉంటేనే కదా.. అందంగా కనిపించడం సాధ్యమయ్యేది! దానికి సాయపడే ఈపీఏ, డీహెచ్‌ఏ వంటివి కొవ్వు పదార్థాలతోనే లభ్యమవుతాయి. ఇవి సహజ నూనెల ఉత్పత్తి, చర్మాన్ని తేమగా ఉంచడం, వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా చేయడంతోపాటు ఎండకు దెబ్బతినకుండానూ కాపాడతాయి.

* పిల్లలు పుట్టాక ఎముకల్లో క్యాల్షియం తగ్గడం చూస్తుంటాం. ఫ్యాటీ యాసిడ్లు కండరాల శక్తితోపాటు క్యాల్షియం ఉత్పత్తినీ పెంచగలవు. దీంతో కీళ్లనొప్పులు వంటివి దరిచేరవు. కాబట్టి.. కొవ్వు తినండి. చేప, డార్క్‌చాక్లెట్‌, గుడ్డు, అవిసెలు, నట్స్‌, నెయ్యి, పెరుగు, చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలు, నువ్వులు, పల్లీలు, ఆలివ్‌ నూనె, శనగలు.. మొదలైనవన్నీ మంచి కొవ్వును అందించేవే. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్