వ్యాయామం విసుగొస్తోందా?

నిజమే మరి! ఒంటరిగా చేస్తోంటే విసుగు వచ్చి తీరుతుంది. అందం, ఆరోగ్యం ఏది కావాలన్నా వ్యాయామమేమో తప్పనిసరి. మరేంటి పరిష్కారం? నలుగురితో కలిసి చేస్తే సరి అంటున్నారు నిపుణులు. దీనివల్ల ప్రయోజనాలూ ఎక్కువేనట.

Published : 24 May 2022 01:41 IST

నిజమే మరి! ఒంటరిగా చేస్తోంటే విసుగు వచ్చి తీరుతుంది. అందం, ఆరోగ్యం ఏది కావాలన్నా వ్యాయామమేమో తప్పనిసరి. మరేంటి పరిష్కారం? నలుగురితో కలిసి చేస్తే సరి అంటున్నారు నిపుణులు. దీనివల్ల ప్రయోజనాలూ ఎక్కువేనట.

ఎంత పరిస్థితులు మామూలు స్థితికి వచ్చినా.. కొవిడ్‌ తర్వాత నలుగురితో కలవడం కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇక గృహిణులు నడక వరకూ అందరితో కలిసి చేయడమంటే సరే! కానీ.. వ్యాయామాల విషయానికొచ్చేసరికి కాస్త మొహమాటపడుతుంటారు. ఇదే తప్పు.

మీతోపాటు మీ చుట్టూ ఉన్నవారూ చేస్తుంటారు. ఇక మిమ్మల్ని చూసే సమయం వాళ్లకెక్కడ? కాబట్టి, ధైర్యంగా స్నేహితుల్ని కూడగట్టేయండి. పైగా చాలా సరదాగా అనిపిస్తుంది. సమయమూ తెలియదు. పైగా మీకోసం మిగతావాళ్లు ఎదురు చూస్తుంటారన్న భావనతో ఎగ్గొట్టడానికీ మనసొప్పదు. ఎప్పుడైనా బద్ధకం వేసి మానేద్దామనుకున్నా.. తోటివారు ఉత్సాహ పరుస్తారు. దీంతో వ్యాయామం అలవాటైపోతుంది.

చుట్టుపక్కల ఎవరూ ఆసక్తి చూపడం లేదనుకోండి... జిమ్‌లో చేరిపోండి. కొత్త స్నేహితులు దొరుకుతారు. ఒకలాంటి పోటీతత్వం ఏర్పడి, వాళ్లతోపాటుగా మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు. పైగా అక్కడ నిపుణులు ఉంటారు. దీంతో తప్పిదాలకూ తావుండదు.

చుట్టూ ఉన్న వాతావరణంతో కొత్తవి ప్రయత్నించడానికీ ఉత్సాహమనిపిస్తుంది. ఇది ఇల్లు, వృత్తి పనుల్లోనూ ప్రతిఫలిస్తుందట. ఇంకేం ప్రయత్నించేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్