కళ్లకీ యోగా!

మునుపటిలా కాదు.. ఇప్పుడు ప్రతిదీ ఒక్క క్లిక్‌ దూరంలోనే. దీంతో బయటికి వెళ్లడం కంటే ఫోన్‌పై ఆధారపడేవాళ్లే ఎక్కువ. మరి కళ్లు అలసిపోకుండా ఉంటాయా? ఫలితమే పొడిబారడం, నొప్పి, ఇతరత్రా సమస్యలు. దీనికితోడు మనం ఆలస్యంగా పడుకొని నిద్రలేస్తుంటాం. ఇదీ కళ్లపై ప్రభావం చూపుతుంది. ఉపశమనం కలగాలంటే ‘ఐ యోగా’ ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

Published : 27 Aug 2022 00:22 IST

మునుపటిలా కాదు.. ఇప్పుడు ప్రతిదీ ఒక్క క్లిక్‌ దూరంలోనే. దీంతో బయటికి వెళ్లడం కంటే ఫోన్‌పై ఆధారపడేవాళ్లే ఎక్కువ. మరి కళ్లు అలసిపోకుండా ఉంటాయా? ఫలితమే పొడిబారడం, నొప్పి, ఇతరత్రా సమస్యలు. దీనికితోడు మనం ఆలస్యంగా పడుకొని నిద్రలేస్తుంటాం. ఇదీ కళ్లపై ప్రభావం చూపుతుంది. ఉపశమనం కలగాలంటే ‘ఐ యోగా’ ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

రెండు అరచేతుల్నీ వేడెక్కే వరకూ రుద్ది మూసిన రెప్పల మీద ఉంచండి. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచిన తర్వాత ఇలా మూడుసార్లు తప్పక చేయండి. కళ్లు అలసిపోయినా ఇలా చేయొచ్చు.

ఎక్కువసేపు ఫోన్‌ చూసినా, కంప్యూటర్‌ మీద పని చేసినా రెప్ప వాల్చడం మర్చిపోతుంటాం. ఫలితమే పొడిబారడం, నొప్పి వగైరా. అందుకే గుర్తొచ్చినప్పుడల్లా కనురెప్పల్ని 10, 15 సార్లు వెంటవెంటనే కొట్టండి. కాస్త విరామం తీసుకొని మళ్లీ చేయండి. ఇలా నాలుగుసార్లు చేయాలి.

కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో వీలైనన్నిసార్లు తిప్పాలి. కొద్దిసేపు విరామం తీసుకొని ఈసారి పైకి, కిందకి కొన్నిసార్లు చేయాలి. కాస్త విరామమిచ్చి మళ్లీ మొదట్నుంచీ చేయాలి. ఇలా నాలుగు తడవలు చేయాలి.

ఒక వేలిని కళ్లకు కొద్ది దూరంలో ఉంచి, కొద్దిసేపు దాన్నే చూడండి. తర్వాత వేలిని కుడి, ఎడమ దిశల్లో తిప్పాలి. అప్పుడూ చూపు మాత్రం వేలిమీదే ఉండాలి. కొద్దిసేపు పక్కకు చూసి మళ్లీ కొనసాగించాలి.

వీటిని రోజుకు రెండు సార్లు చేస్తే కళ్ల సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్