దిండుతోనూ వ్యాయామం!

ప్రసవమయ్యాక క్యాల్షియం తగ్గడం, ఇంటి పనుల్లో భాగంగా గంటల తరబడి నిలుచుని ఉండటం... ఆడవాళ్లలో త్వరగా మోకాళ్ల నొప్పులకు కారణాలెన్నో. ఇక ఆర్థరైటిస్‌ కూడా తోడైతే నడవడమూ ఇబ్బందే! ఉపశమనానికి మంచం మీదచేసే ఈ వ్యాయామాలు ప్రయత్నించేయండి.

Published : 06 Jun 2023 00:08 IST

ప్రసవమయ్యాక క్యాల్షియం తగ్గడం, ఇంటి పనుల్లో భాగంగా గంటల తరబడి నిలుచుని ఉండటం... ఆడవాళ్లలో త్వరగా మోకాళ్ల నొప్పులకు కారణాలెన్నో. ఇక ఆర్థరైటిస్‌ కూడా తోడైతే నడవడమూ ఇబ్బందే! ఉపశమనానికి మంచం మీదచేసే ఈ వ్యాయామాలు ప్రయత్నించేయండి.

* మంచం మీద కాళ్లు కిందకి వేలాడేలా కూర్చోవాలి. కాళ్ల కింద వరకు దిండు అమర్చుకోవాలి. చేతులు వెనక ఆధారంగా చేసుకొని నెమ్మదిగా రెండు కాళ్లను పైకి లేపి, కొన్ని సెకన్లు ఉంచి, నెమ్మదిగా కిందకి దించాలి. ఇలా అయిదు సెట్లు చేస్తే సరి. తర్వాత ఒక కాలిని నేలకి ఆన్చి, మరోదాన్ని పైకి లేపాలి. వీలైనంత సేపు అలా ఉంచి, మరోకాలితో చేయాలి. అలా ఒక్కో కాలితో అయిదు సెట్లు చేయాలి.

* విశ్రాంతిగా పడుకొని నెమ్మదిగా కాళ్లను ముడవాలి. చేతులు పక్కగా ఉంచాలి. కాళ్లను కాస్త దూరంగా జరిపి, మోకాళ్ల మధ్యలో దిండును పట్టి గట్టిగా అదిమినట్లుగా చేయాలి. ఇలా కొన్ని సెకన్లు ఉంచి, యథాస్థితికి రావాలి. దీన్ని పది సెట్లు చేయాలి.

* సుఖాసనంలో పడుకోండి. చేతులు కాళ్లకు పక్కగా ఉండాలి. మోకాళ్ల కిందుగా దిండును ఏర్పాటు చేసుకోవాలి. నెమ్మదిగా ఒక కాలిని పైకి లేపాలి. పది సెకన్లు ఉంచి, నెమ్మదిగా కిందకి దింపాలి. వీటిని ఉదయం, సాయంత్రం రెండుసార్లు చేస్తే కీళ్లు పట్టేసినట్లు ఉండటం, నొప్పి వంటివి క్రమంగా తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్