కంటి ఇన్‌ఫెక్షనా...
కళ్ల్ల కలకనే కాదు.. వాతావరణంలోని మార్పుల కారణంగా కూడా కళ్లు ఎర్రబారుతుంటాయి. ఇన్‌ఫెక్షన్లూ వ్యాప్తి చెందుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేసి చూడండి.
Published : 05 Aug 2023 00:15 IST
కళ్ల్ల కలకనే కాదు.. వాతావరణంలోని మార్పుల కారణంగా కూడా కళ్లు ఎర్రబారుతుంటాయి. ఇన్‌ఫెక్షన్లూ వ్యాప్తి చెందుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేసి చూడండి..
- తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీల నుంచి రక్షిస్తాయి. రెండు టెబుల్‌స్పూన్ల తేనెను గ్లాసు నీటిలో కలిపి ఆ నీటితో కంటిని పైపైన శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల నొప్పి, దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
- రోజ్‌వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. ఇవి కంటికి కలిగే చికాకు, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. దూదితో శుభ్రం చేసుకుంటే చాలు.
- ఆయుర్వేద గుణాలు మెండుగా ఉండే తులసి కళ్ల కలక నుంచి రక్షణ కల్పిస్తుంది. కొన్ని తులసి ఆకుల్ని నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో కంటిని కడగాలి. ఇలా నాలుగు రోజులు వరుసగా చేస్తే మంటలు తగ్గుతాయి.
- ఇంట్లోనే సహజసిద్ధంగా ఐవాష్‌లను తయారు చేసుకోవచ్చు. కొన్ని వేపాకులను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటితో కంటిని శుభ్రం చేసుకోవాలి.
- పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. గోరువెచ్చని పసుపు నీళ్లలో దూదిని ముంచి, కంటిని శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చుట్టూ ఉండే దుమ్మూ, బ్యాక్టీరియా తొలగి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
- బంగాళాదుంపని సన్నని చక్రాలుగా కోసి పడుకునే ముందు ఓ పది నిమిషాలు కళ్లపై ఉంచాలి. ఇది మంటను తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే గ్రీన్‌టీ బ్యాగ్‌లను గోరు వెచ్చని నీటిలో వేసి తీసి, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత కంటిపై పెట్టుకోవాలి. ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటుగా కంటికి సరిపడా నిద్ర, సమతుల ఆహారం తీసుకోవాలి. సమస్య మరీ ఎక్కువ ఉంటే డాక్టరును సంప్రదించాలి.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.