కాబోయే అమ్మకు.. డ్రాగన్‌!

గర్భదారణ తర్వాత కడుపులో బిడ్డతోపాటు కాబోయే అమ్మకూ బోలెడు పోషకాలు అవసరమవుతాయి. అవన్నీ అందితేనే ఈ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలు దూరమవుతాయి. అందుకు సాయపడే వాటిల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి! సీజనల్‌ పండ్లతోపాటు దీనికీ చోటివ్వండి.

Updated : 11 Oct 2023 04:15 IST

గర్భదారణ తర్వాత కడుపులో బిడ్డతోపాటు కాబోయే అమ్మకూ బోలెడు పోషకాలు అవసరమవుతాయి. అవన్నీ అందితేనే ఈ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలు దూరమవుతాయి. అందుకు సాయపడే వాటిల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి! సీజనల్‌ పండ్లతోపాటు దీనికీ చోటివ్వండి.

  • హార్మోనుల్లో తేడా కారణంగా చర్మం నిర్జీవంగా కళ తప్పినట్టుగా తయారవుతుంది. తరచూ డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌, లైకోపిన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ని తొలగించి, చర్మానికి సహజ మెరుపునిస్తాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచి, ఈ సమయంలో వచ్చే వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • ప్రెగ్నెన్సీలో విటమిన్‌ బి12 సరిగా ఉండేలా చూసుకోమంటారు వైద్యులు. శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సాయపడే ఈ విటమిన్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ నుంచి సమృద్ధిగా అందుతుంది.
  • కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తుంటుంది. ఈ జెస్టేషనల్‌ డయాబెటిస్‌కి హార్మోనుల్లో విపరీతమైన మార్పులూ కారణమే. అలాంటివారు ఈ పండును తీసుకుంటే సరి. ఉపశమనం అందించడమే కాదు. దీనిలోని పీచు హెచ్చుతగ్గులను అదుపులో ఉంచుతుంది.
  • ఈ స్థితిలో విపరీతమైన కడుపుబ్బరం, జీర్ణసమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ పండులోని పీచు జీర్ణప్రక్రియ సజావుగా జరిగేలా చేసి, అజీర్తి, మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది.
  • క్యాల్షియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కొందరికి ప్రెగ్నెన్సీలో ఏ వాసనా పడదు. అలాంటి జాబితాలో పాలు ఉంటే బదులుగా డ్రాగన్‌ఫ్రూట్‌ తీసుకుంటే క్యాల్షియాన్ని భర్తీ చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఐరన్‌ హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచి రక్తహీనతను దరిచేరనీయదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్