వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!

వసంతకాలంలో మన శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వివిధ రకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు శరీరంలోని పీహెచ్‌ స్థాయులను దెబ్బతీస్తాయి. దీని కారణంగా జీర్ణశక్తి మందగించి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

Published : 19 Mar 2024 01:12 IST

వసంతకాలంలో మన శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వివిధ రకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు శరీరంలోని పీహెచ్‌ స్థాయులను దెబ్బతీస్తాయి. దీని కారణంగా జీర్ణశక్తి మందగించి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రక్తపోటు, మూత్ర సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. వీటినుంచి రక్షణ పొందాలంటే... ఈ జాగ్రత్తలు పాటించాలి.

  • వసంతంలో పువ్వులు వికసించేటప్పుడు వాటిలో ఉండే పుప్పొడి గాలిలోకి చేరి అలర్జీ బాధితులకు తుమ్ములు మొదలవుతాయని అమెరికన్‌ పరిశోధనల్లో తేలింది. తద్వారా సైనస్‌, దగ్గు, జలుబు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వీరు క్రమం తప్పకుండా రుతువులను అనుసరించి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనివల్ల సీజనల్‌ వ్యాధులు దరిచేరవు. ఆరోగ్యంగానూ ఉంటారు.
  • ఈ సమస్యలున్నవారిలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా పేగుల్లోని లింఫోయిడ్‌ కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి తేలికపాటి అల్పాహారాన్నే తీసుకోవాలి. పులుపూ, తీపి పదార్థాలతో పాటు నూనె ఎక్కువగా వాడే ఆహారానికీ దూరంగా ఉండాలి. తేనె, బార్లీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • ఈ కాలంలో ఔషధ గుణాలుండే ఆహారపదార్థాలు... కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉల్లి, ముల్లంగి, అల్లం వంటి వాటిని టీ చేసుకుని తాగితే కఫం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్‌ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కణజాలానికి కావాల్సిన ఆక్సిజన్‌నీ అందిస్తుందని జపాన్‌లోని టొయామా మెడికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది. రోజూ యోగ చేయడం వల్ల శరీరం సౌకర్యంగా ఉండటంతో పాటు జలుబు, దగ్గు వంటి వాటి నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్