సంతోషాన్నీ సాధించుకోవచ్చు..!

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లు, సాధన చేస్తే పొందలేనిదేమీ లేదు. ఈ సూత్రం సంతోషానికీ వర్తిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్స్‌ చేసిన పరిశోధనలో వెల్లడైంది.

Published : 21 Mar 2024 02:06 IST

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లు, సాధన చేస్తే పొందలేనిదేమీ లేదు. ఈ సూత్రం సంతోషానికీ వర్తిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్స్‌ చేసిన పరిశోధనలో వెల్లడైంది. 2018లో ఈ విశ్వవిద్యాలయం, వారి విద్యార్థులకు ‘సైన్స్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ అనే కోర్సును ప్రవేశపెట్టారు. అందులో సంతోషానికి కారణమయ్యే విషయాలు... అంటే కృతజ్ఞతాభావం, వ్యాయామం, ధ్యానం, స్నేహితులతో సమయం గడపడం, కొత్త విషయాలు తెలుసుకోవడం... లాంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. కోర్సు తీసుకున్న విద్యార్థుల మానసిక ఆరోగ్యంలో వృద్ధి కనిపించిందట. అయితే ఇందులోనూ ఓ మెలిక ఉంది. అదేంటంటే నేర్చుకున్న విషయాలను దీర్ఘకాలంపాటు సాధన చేసిన వారిలోనే ఈ ప్రయోజనాలు కొనసాగాయట. రెండేళ్ల తరవాత ఆ విద్యార్థులను పరీక్షిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అంటే మనం జిమ్‌కు ఒక్కరోజు వెళ్లి ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని కోరుకోవడం ఎంత అసమంజసమో అలానే ఇది కూడా. అందుకే మానసికంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సంతోష సూత్రాలను నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. లేకుంటే మనకు దక్కే ప్రయోజనాలూ తాత్కాలికమే. ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటే, అందుకు తగ్గ సంతోష సాధనా తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్