కలబందతో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పుల వల్ల శరీరంలో పీహెచ్‌ స్థాయుల సమతుల్యత దెబ్బతినడమే కాకుండా ఆమ్లస్థాయి పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

Published : 22 Mar 2024 01:34 IST

మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పుల వల్ల శరీరంలో పీహెచ్‌ స్థాయుల సమతుల్యత దెబ్బతినడమే కాకుండా ఆమ్లస్థాయి పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వీటి నుంచి రక్షణ పొందడానికి కలబంద రసం చక్కగా పనిచేస్తుంది. అసిడిటినీ తొలగించి,  ఆరోగ్య ప్రయోజనాలిచ్చే దీన్ని నిపుణుల సలహాతో తీసుకోవచ్చు.

  •  కలబంద రసంలో విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని తేమగా ఉంచడంలో సాయపడతాయి. వ్యాయామం తరవాత ఈ జ్యూస్‌ను తాగడం వల్ల కోల్పోయిన పోషకాలు తిరిగి అందడంతో పాటు చర్మానికి కావాల్సిన నీరూ అందుతుంది. దీంట్లో ఉండే ఫైటోన్యూట్రియంట్లు కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి.
  • రోజూ కలబంద గుజ్జును తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అంది... చురుగ్గా ఉండొచ్చు. ఇందులోని పోషకాలు కండరాలను బలంగా మారుస్తాయి.
  • ఇందులోని విటమిన్‌- బి, సి, ఫోలిక్‌ యాసిడ్లు, ఖనిజాలు, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ వంటివి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతాయి. విటమిన్‌- ఇ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.
  • ఇందులోని ఎంజైమ్‌లు మనం తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించడానికీ, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికీ, శరీరంలో పేరుకున్న చక్కెరనూ, కొవ్వులనూ, కరిగించడానికీ సాయపడతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్‌- సి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. రోజూ టీస్పూన్‌ కలబందగుజ్జు గ్లాసు నీటిలో కలిపి తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్