నీళ్లే కదా...అని నిర్లక్ష్యం వద్దు!

ఎండలు పెరిగే కొద్దీ ఒంట్లో నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటప్పుడు చల్లగా ఓ గ్లాసు మంచినీళ్లు తాగితే చాలు... కుదుటపడొచ్చు.

Published : 25 Mar 2024 01:34 IST

ఎండలు పెరిగే కొద్దీ ఒంట్లో నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటప్పుడు చల్లగా ఓ గ్లాసు మంచినీళ్లు తాగితే చాలు... కుదుటపడొచ్చు. అంతేకాదు, నీటిని తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలూ ఉన్నాయట.

  • డీహైడ్రేషన్‌ వల్ల శరీరంలోని శక్తిస్థాయిలు పడిపోతాయి. అప్పుడే కాదు, మరెప్పుడైనా కళ్లు తిరుగుతున్నా, అలసటగా అనిపించినా... కడుపు నిండా తినలేదేమో అనుకోవడమే కాదు... తగినన్ని నీళ్లు తీసుకున్నామో లేదో అని కూడా గమనించుకోండి అంటున్నారు నిపుణులు.  
  • వేళ కాని వేళ ఆకలి వేస్తుందా? వెంటనే ఓ గ్లాసు నీళ్లు తాగండి. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎందుకంటే ఆకలి, దాహం భావనల్ని మెదడు ఒకేలా గ్రహించడమే ఇందుకు కారణం. లేదంటే బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉండటానికీ, వడదెబ్బ తగలకుండానూ, కీళ్లు తేలిగ్గా కదలడానికీ, సున్నితమైన కణజాలం దెబ్బతినకుండానూ నీరెంతగానో సాయపడుతుంది.
  • ఈ కాలమే కాదు... ఎప్పుడైనా సరే. నీళ్లు సరిగా తాగకపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు, ఒంట్లో వ్యర్థాలు, కొవ్వులు పేరుకుపోయి బరువూ పెరిగిపోతాం. అందుకే డైటింగ్‌ చేసేవారు సమతులాహారం తీసుకోవడంతో పాటు తగినన్ని నీళ్లూ తీసుకోవాలంటారు నిపుణులు. అలానే మూత్ర పిండాల పనితీరు, ఇతర శరీర విధులు సక్రమంగా సాగిపోవాలన్నా కూడా ఇవి ఎంతో అవసరం.
  • ఉదయం నిద్ర లేచాక ఓ గ్లాసు నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉండొచ్చట. ముఖ్యంగా పెద్ద పేగులో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు, డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పితో పాటు మైగ్రెయిన్‌, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లూ తగ్గుతాయట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్