కోపానికి కారణాలేంటో..

పిల్లల మానసిక పరిస్థితులను ఊగే ఊయలతో పోల్చవచ్చు. ఎందుకంటే అది ఒక చోట కుదురుగా ఉండదు కదా.. అలానే వారి మూడ్‌ కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, విసుగు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి....

Published : 28 Jun 2021 01:06 IST

పిల్లల మానసిక పరిస్థితులను ఊగే ఊయలతో పోల్చవచ్చు. ఎందుకంటే అది ఒక చోట కుదురుగా ఉండదు కదా.. అలానే వారి మూడ్‌ కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, విసుగు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి.

తిట్టొద్దు... కొట్టొద్దు! అసలే కోపంతో ఉన్న పిల్లలను  కోప్పడటమో, కొట్టడమో చేయద్దు. ఇలా చేస్తే అగ్నికి ఆజ్యాన్ని పోసినట్లే అవుతుంది. ఇలాంటి సమయంలో మీరే కొంత సంయమనం పాటించాలి. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత వారి కోపానికి కారణమేంటో కనుక్కోవాలి. వాటిని అప్పటికప్పుడు పరిష్కరించకపోయినా... క్రమంగా వారి భావోద్వేగాలను అదుపుచేసుకోగలిగే సమర్థతను వారికి నేర్పాలి.

అన్నదల్లా తీర్చొద్దు... తాము అడిగినవి అమ్మానాన్నలు కాదన్నారని టీనేజర్లకు కోపం వస్తుంటుంది. అయితే వారు అడిగనవన్నీ చేసుకుంటూ పోవద్దు. అవసరం, ప్రాధాన్యత ఆధారంగానే...వాటిని తీర్చాలి.  
పూర్తిగా వినండి... పిల్లల కోపాన్ని చూసీ చూడనట్లు వదిలేయొద్దు. అందుకుగల కారణాలను వారినే అడిగి తెలుసుకోండి. పూర్తిగా విన్నాకే పరిష్కారాన్ని సూచించండి. వాస్తవాలను అంగీకరించేలా వారిని ఒప్పించండి. అప్పుడు సర్దుబాటు వారికి అలవాటవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్