పుడుతూనే పసిగడతారు...

అందాకా ఆడుతూ పాడుతూ ఉన్న తల్లులకి చిన్నారి రాక ఎంత ఆనందాన్నిచ్చినా సాకడం కొంత జటిలంగానే తోస్తుంది.

Published : 07 Jul 2021 00:47 IST

అందాకా ఆడుతూ పాడుతూ ఉన్న తల్లులకి చిన్నారి రాక ఎంత ఆనందాన్నిచ్చినా సాకడం కొంత జటిలంగానే తోస్తుంది. అందుకే బుజ్జాయిల పెంపకంలో సైకాలజిస్టుల విలువైన సూచనలివి..

పిల్లలు పుడుతూనే 100 బిలియన్‌ న్యూరాన్స్‌తో పుడతారు. అవి ఎదుటి వ్యక్తి హావభావాలతో సహా అనేకం గుర్తిస్తాయి. కనుక చిన్నారి పట్ల ఉన్న ఇష్టాన్ని చక్కగా వ్యక్తం చేయాలి. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, లాలించడం వల్ల వాళ్లు భద్రత పొందుతారు, ఆ ప్రేమ చిన్నారులకు శక్తిని, సంతృప్తిని ఇస్తుంది.

* మీరు ఉద్యోగం, ఇతరత్రా బాధ్యతలతో ఎంత ఇబ్బంది పడుతున్నా సరే.. వీలైనంత ఎక్కువసేపు వారితో గడపండి. ఊహ తెలీని వయసు నుంచీ పిల్లలు తల్లి కోసం వెతుక్కోవడం, అమ్మ దగ్గర సంతోషంగా ఉండటం తెలిసిందే. మాతృస్పర్శ ధైర్యాన్నీ ధీమానీ ఇస్తుందని మనోవైజ్ఞానికులు చెబుతున్నారు.

* ఇంకా మాటలు రాని పిల్లలతో మాటలేంటి అనుకోకుండా వారితో సంభాషించమంటున్నారు సైకాలజిస్టులు. చిన్నారులు బదులివ్వలేకున్నా కొద్దికొద్దిగా అర్థం చేసుకుంటారని, నెమ్మదిగా వారి మెదడు వికసిస్తుందని చెబుతున్నారు.

* వారిని ఉయ్యాలకో, వాకర్‌కో పరిమితం చేయకుండా బయట తిప్పడం చాలా అవసరం. ఇందువల్ల డి విటమిన్‌ అందడమే కాక అన్నిటినీ పరికిస్తూ ఉత్సాహంగా ఉంటారు, అలా ఎన్నో నేర్చుకుంటారు.

* పిల్లలను కసరడం లేదా వాళ్ల ముందు అరచుకోవడం తగదని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల తాత్కాలికంగా జడుసుకోవడమే కాదు, దీర్ఘకాలంలో నలుగురిలో కలవలేని తత్వం, ముడుచుకుపోయే స్వభావం ఏర్పడతాయట.

* వివిధ రంగులు, ఆకృతుల బొమ్మలు చూపుతూ వాటితో దోబూచులాడుతూ గుర్తుపట్టేలా ప్రోత్సహించండి. ఇది చిన్నారికి ఆనందాన్నిస్తూనే వారి చిట్టి మెదళ్లను ఉత్తేజితం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్