మాటలో ప్రేమ నిండితే...

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం. దాంపత్య జీవితం కలకాలం నిలవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఒక్కోసారి కొద్ది రోజులకే దంపతుల మధ్య భేదాభిప్రాయాలు మొదలవుతాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి,

Published : 16 Jul 2021 01:38 IST

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం. దాంపత్య జీవితం కలకాలం నిలవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఒక్కోసారి కొద్ది రోజులకే దంపతుల మధ్య భేదాభిప్రాయాలు మొదలవుతాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి, ఆ బంధం బీటలు వారే వరకు కొనసాగుతాయి. మొగ్గదశలోనే ఇటువంటి సందర్భాలను తుంచేయగలిగితే ఆ దంపతుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఇరువురూ తమ మాటలో ఎదుటి వారిపై ప్రేమను నింపితే చాలు అది వారిని కలకాలం కలిసి ఉండేలా చేస్తుందని సూచిస్తున్నారు.

మిస్‌ కాకుండా...
ఇరువురూ ఒకరినొకరు మిస్‌ కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు దొరికిన కొంత సమయాన్నీ ఇద్దరూ కలిసి గడపడం నేర్చుకోవాలి. ఆ రోజు ఎదురైన సంఘటనలు, అనుభవాలను పంచుకోవాలి. సెలవు రోజున ఇరువురూ కలిసి వంటపని, తోటపని, ఇంటి శుభ్రతలో పాలుపంచుకోవాలి. సమయం ఉన్నప్పుడల్లా దంపతులు ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది.

ఉత్సాహంగా
పెళ్లైన కొత్తలో నాజూకుగా, అందంగా, నిత్యం ఉత్సాహంగా కనిపించిన జీవితభాగస్వామిలో కొన్ని రోజులకే మార్పు కనిపిస్తే అది ఎదుటి వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది. అధిక బరువుకు లోనుకావడం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి తగ్గిపోవడం వంటివాటికి దూరంగా ఉండాలి. భార్యాభర్తలు కలిసి వ్యాయామాలు చేయడం, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సరదాగా పార్కుకు వెళ్లి నడిస్తే ఆ సమయం కలిసి గడిపినట్లు ఉంటుంది. శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇరువురి అనుబంధాన్ని పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్