దెప్పిపొడుపులొద్దు

వివాహబంధంలో అడుగుపెట్టిన తరువాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. భాగస్వామి అలవాట్లో, వాళ్లు మనకు నచ్చని పనులు చేయడమో కూడా అంతే సహజం.

Published : 27 Jul 2021 01:38 IST

వివాహబంధంలో అడుగుపెట్టిన తరువాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. భాగస్వామి అలవాట్లో, వాళ్లు మనకు నచ్చని పనులు చేయడమో కూడా అంతే సహజం. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని ఎదుటివారిపై విమర్శల దాడి మొదలుపెడతారు. దానికి అవతలి వారూ కఠినంగా బదులిస్తారు. ఫలితంగా భార్యాభర్తలు క్రమంగా ఒకరిపై మరొకరు గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే గత విషయాలను గుర్తుకు తెచ్చి మరీ దెప్పిపొడిచే తత్త్వం ఉంటే తక్షణం దాన్ని మానేస్తే మంచిది. లేదంటే బంధం బీటలు వారే ప్రమాదం ఉంది. అవతలివారి ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపిస్తే దాన్ని చర్చించుకోవాలి. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతానికి విలువనిచ్చి జీవిత భాగస్వామిని ప్రేమిస్తే ఆ దాంపత్యం నిత్యనూతనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్