అవెన్‌ వాడుతున్నారా...

పిల్లలకిష్టమైనవాటిని నిమిషాల్లో మైక్రోవేవ్‌ అవెన్‌లో వండిపెట్టడానికి సిద్ధపడే తల్లులు ముఖ్యంగా కొన్ని పాటించాల్సిన అంశాలున్నాయి. దీన్ని వినియోగించేటప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకుంటే తేలికగా రుచికరమైన

Published : 02 Aug 2021 01:22 IST

పిల్లలకిష్టమైనవాటిని నిమిషాల్లో మైక్రోవేవ్‌ అవెన్‌లో వండిపెట్టడానికి సిద్ధపడే తల్లులు ముఖ్యంగా కొన్ని పాటించాల్సిన అంశాలున్నాయి. దీన్ని వినియోగించేటప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకుంటే తేలికగా రుచికరమైన పదార్థాలను చిటికెలో తయారుచేయొచ్చు. అవేంటంటే...

పరిశీలించాలి : అవెన్‌ను ఆన్‌చేసే ప్రతిసారి టెంపరేచర్‌ స్విచ్‌ను పరిశీలించాలి. అంతకుముందు వండిన ఆహారపదార్థానికి తగ్గట్లుగా ఉండే టెంపరేచర్‌ను ప్రస్తుతం మీరు తయారుచేయబోయేదానికి సరిపడేలా అడ్జెస్ట్‌ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇందులో అతి ఎక్కువ, మధ్యస్థం, తక్కువ ఉష్ణోగ్రతలుంటాయి. ఎంత వేడికి ఆహారపదార్థం ఉడుకుతుందో ముందే తెలుసుకుని దానికి తగ్గట్లుగా అమర్చుకుంటే చాలు.

ఎక్కువగా వద్దు : మైక్రోవేవ్‌లో ట్రే ఉంచేటప్పుడు అందులోని ఆహారపదార్థం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఉదాహరణకి బిస్కట్లు తయారుచేస్తున్నప్పుడు విడివిడిగా ట్రేలో సరిపోయేలా మాత్రమే సర్దాలి. కిక్కిరిసి ఉంటే అనుకున్నట్లుగా రుచి రాకపోవచ్చు.

చెక్‌ చేయాలి : ఆహారపదార్థానికి సరిపడే సమయాన్ని ముందుగానే ఫిక్స్‌ చేసినప్పుడు పూర్తయిన వెంటనే ఓసారి అది ఉడికిందో లేదో చూసుకోవాలి. లేదంటే మరొకసారి సమయాన్ని తక్కువగా చేసి ఉంచితే చాలు. అలాగే అందులో ఉపయోగించే ట్రేల ఎంపికలో పరిమాణం, నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఉదాహరణకు కేకు తయారీకి లోతైన ట్రే అవసరమవుతుంది. బిస్కట్లువంటివాటికి లోతు తక్కువ ఉన్నా కూడా ఫర్వాలేదు.

శుభ్రత : పని పూర్తయిన తర్వాత అవెన్‌ను చల్లారనిచ్చి, లోపల ఆహారవ్యర్థాలు లేకుండా మెత్తని వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. అవెన్‌లోని ట్రేలను బయటికి తీసేటప్పుడు చేతులకు సరైన కాటన్‌ గ్లవుజులను వాడితే సురక్షితం. అంతేకాదు, వండిన ట్రేలను వెంటనే శుభ్రపరిచి పొడి వస్త్రంతో తుడిచి భద్రపరచాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్