చిట్టి మనసు హాయిగా..

కరోనాతో చాలా కాలంగా పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఆన్‌లైన్‌ క్లాసులు... ఆట విడుపు దొరక్క, తోటి పిల్లలతో కలిసే వీలులేక ఒత్తిడికి గురవుతున్నారంటున్నాయి పలు అధ్యయనాలు. మరి ఆ ప్రభావం వారి మీద పడకుండా

Published : 13 Aug 2021 00:57 IST

కరోనాతో చాలా కాలంగా పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఆన్‌లైన్‌ క్లాసులు... ఆట విడుపు దొరక్క, తోటి పిల్లలతో కలిసే వీలులేక ఒత్తిడికి గురవుతున్నారంటున్నాయి పలు అధ్యయనాలు. మరి ఆ ప్రభావం వారి మీద పడకుండా ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.

పిల్లల్లో ఒత్తిడిని తీసేసేవి ఆటలే. ఆరు బయట ఆడలేకపోవచ్చు. కానీ ఇంట్లో అందుకు సమయం కేటాయించమనండి. తాడాట, దాగుడు మూతలు, డాబాపై కబడ్డీ వంటివి ప్రయత్నించొచ్చు. లేదా కాసేపు సబ్బునీటి బుడగలు ఊదించండి చాలు. ఇవన్నీ ఒత్తిడి తగ్గిస్తాయి.

* చిన్నారులు అకారణంగా అరవడం, మీ మాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే... కొట్టడం తిట్టడం చేయొద్దు. అవీ ఒత్తిడి ప్రభావమే. ఇలాంటప్పుడు వారికి ఇష్టమైనవి చేసి పెట్టండి. తన స్నేహితులతో వీడియో కాల్‌లో మాట్లాడించండి.

* ఎక్కడికీ వెళ్లకుండా, ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వస్తే... పెద్దలమే విసిగిపోతుంటాం. ఇందుకు చిన్నపిల్లలు మినహాయింపు కాదని అర్థం చేసుకోవాలి. అందుకే వారికి పని కల్పించాలి. సరదాగా తోట పని అప్పజెప్పండి. కుండీలను కొనిచ్చి మొక్కలు పెంచమనండి. లేదా ఖాళీ కూల్‌డ్రింకు సీసాల్లోనూ పెంచొచ్చు. హాబీలకు శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించండి. ఇవన్నీ వారి బాధను తగ్గిస్తాయి. చలాకీగా ఉండేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్