ముచ్చటైన బంధానికి మూడు సూత్రాలు!

పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకు.. భయం.. సహజమే. ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో సంశయం... అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు ముందడుగు వేసి మాట కలపడం వల్ల ఎదుటివారు కొంత సమయం తీసుకున్నా ఆ తర్వాతకలిసి పోతారు.

Updated : 13 Aug 2021 04:19 IST

పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకు.. భయం.. సహజమే. ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో సంశయం... అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు ముందడుగు వేసి మాట కలపడం వల్ల ఎదుటివారు కొంత సమయం తీసుకున్నా ఆ తర్వాత కలిసి పోతారు. కొత్త జంట మధ్య మాటల ప్రయాణం మొదలవ్వాలంటే...

1 కమ్యూనికేషన్‌... కొత్త జంటకు కమ్యూనికేషన్‌ అత్యంత అవసరం. రోజులో జరిగిన విషయాలను భాగస్వామితో పంచుకోవడం వల్ల ఆనందాలు రెట్టింపవుతాయి. అలాగే ఏదైనా బాధ ఉంటే దాన్నీ షేర్‌ చేసుకుంటే తగ్గిపోతుంది. అన్నీ తనతో పంచుకోవడం వల్ల ఎదుటి వారికి మీ పట్ల నమ్మకంతోపాటు అభిమానమూ పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది.

2 అన్యోన్యతకే పెద్దపీట... జీవిత భాగస్వామి దగ్గర దాపరికాలు ఉండకూడదు. శారీరక, మానసిక... విషయమేదైనా మనసు విప్పి మాట్లాడగలగాలి. భార్యాభర్తల మధ్య అల్లుకున్న శారీరక, మానసిక అనుబంధాలే వారి అన్యోన్యతను చెబుతాయి. ఇవి వారిద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి. లైంగిక అనుబంధం ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది.

3 ఉత్తమ శ్రోతగా... ఎదుటివారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినండి. అంతే తప్ప ఎప్పుడూ మీరే మాట్లాడాలని, ఎదుటివారు వినాలని కోరుకోవద్దు. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా, వింటే తన మనసులో మాట మీకు తెలుస్తుంది. కాబట్టి ఎదుటి వారు చెప్పేది సాంతం వినండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్