గొడవ తెగనివ్వండి!

ఆలుమగలు కష్టసుఖాల్ని సమానంగా పంచుకోవాలి. ఒకరు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మరొకరు నేనున్నానే భరోసా ఇవ్వాలి. చేతల ద్వారా చూపించాలి. అంటే పక్కన కూర్చుని భుజాన చేయి వేయడం, చేతిలో చేయి వేసి ధైర్యాన్నివ్వడం వంటివి చేయాలి. ఇవన్నీ అనుబంధంలో నమ్మకాన్ని పెంచుతాయి.

Published : 04 Sep 2021 02:24 IST

భార్యాభర్తల అనుబంధంలో చిన్నచిన్న మనస్పర్థలు సహజమే కానీ అవి త్వరగా సమసిపోవాలంటే సర్దుబాట్లు తప్పనిసరి.

లుమగలు కష్టసుఖాల్ని సమానంగా పంచుకోవాలి. ఒకరు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మరొకరు నేనున్నానే భరోసా ఇవ్వాలి. చేతల ద్వారా చూపించాలి. అంటే పక్కన కూర్చుని భుజాన చేయి వేయడం, చేతిలో చేయి వేసి ధైర్యాన్నివ్వడం వంటివి చేయాలి. ఇవన్నీ అనుబంధంలో నమ్మకాన్ని పెంచుతాయి.

* వాదనలూ, గొడవపడటం.. లాంటివన్నీ భార్యాభర్తలకు సహజమే. అయితే కొన్ని వాదనలు ఎంతకీ తెగవు. అలాంటప్పుడు అదేపనిగా వాదించుకోవడం, మాట్లాడుకోవడం మానేయడం కాకుండా ‘మనం ఈ వాదనను వాయిదా వేద్దామా..’ అనేయండి. దానివల్ల సమస్య కొన్నాళ్లకు వాయి దా పడుతుంది. మీ మధ్య దూరం కూడా పెరగదు. అంతే కాదు.. తొందరపాటు నిర్ణయం కూడా తీసుకోకుండా ఉంటారు.

* పెళ్లయిన కొత్తల్లో భాగస్వామి మీద ఉన్న ప్రేమంతా చేతల్లో, మాటల్లో ఎంతో ఇష్టంగా చూపిస్తూనే ఉంటాం. కానీ ఏళ్లు గడిచేకొద్దీ అలా చెప్పడం తగ్గిపోతుంది. కానీ మీరు మాత్రం ఆ పనిచేయకండి. సందర్భం దొరికినప్పుడు ప్రేమను వ్యక్తపరచండి. అదే మీ బంధాన్ని సజీవంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్