నెట్టింట.. నిలిచేలా

ఆన్‌లైన్‌ చదువులతో ఇంటర్నెట్‌ చిన్నపిల్లలకీ పరిచయమైంది. తమంతట తాముగా సోషల్‌ మీడియాలో ప్రతిభను చూపుతున్నవాళ్లు కొందరైతే, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నవారు మరికొందరు. మరి వాటి

Published : 13 Sep 2021 00:51 IST

ఆన్‌లైన్‌ చదువులతో ఇంటర్నెట్‌ చిన్నపిల్లలకీ పరిచయమైంది. తమంతట తాముగా సోషల్‌ మీడియాలో ప్రతిభను చూపుతున్నవాళ్లు కొందరైతే, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నవారు మరికొందరు. మరి వాటి నుంచి ఎదురయ్యే ముప్పు సంగతేంటి? వాటి నుంచి వాళ్లని సురక్షితంగా ఉంచాలంటే..

* ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇప్పుడు సర్వసాధారణమైంది. మీ పిల్లలు ఆడేవాటి గురించి తెలుసుకోండి. అది గూఢచర్యంలా కాకుండా వాళ్లతో చర్చిస్తున్నట్లుగా ఉండాలి. చిన్నారుల స్నేహితుల గురించీ చర్చించండి. వాళ్లు ఉపయోగించే వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల గురించి తెలుసుకోవాలి.

* అంతర్జాలం వల్ల లాభాలతోపాటు వీటి నుంచి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను వారికి వివరించండి. వాటికి దూరంగా ఉండమని చెప్పడం మీ ఉద్దేశం కాకూడదిక్కడ. సైబర్‌ బుల్లీయింగ్‌, వ్యతిరేక కామెంట్లు వంటివి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. మొత్తంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీతో పంచుకునేలా మీ తీరుండాలి.

* వాళ్ల ఖాతాలు సురక్షితం చేసుకోవడంలో సాయం చేయండి. తమ ఫాలోయింగ్‌ను మీరు తగ్గిస్తున్నారని భావించే పిల్లలే ఎక్కువ. కాబట్టి తెలియని వాళ్లతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలను విడమరిచి చెప్పండి. అలాంటి ఇబ్బందులు ఎదురైతే రిపోర్ట్‌, బ్లాకింగ్‌ ఆప్షన్లను ఉపయోగించడమూ నేర్పించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్