అనుబంధానికి ప్రణాళిక వేద్దాం!

అవును వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది కానీ...మీ బంధంలోని లోపాలను సరిద్దుకోవడానికీ, చక్కటి సాంగత్యాన్ని, మధురస్మృతులనూ నింపుకోవడానికీ ఇది ఎంతో అవసరం.

Updated : 23 Sep 2021 05:34 IST

అవును వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది కానీ...మీ బంధంలోని లోపాలను సరిద్దుకోవడానికీ, చక్కటి సాంగత్యాన్ని, మధురస్మృతులనూ నింపుకోవడానికీ ఇది ఎంతో అవసరం.

ప్రణాళిక అనగానే సమీక్షలూ, లోటుపాట్ల అంచనాలూ ఉంటాయికదా.. వాటినీ బేరీజు వేసుకోవాలంటున్నారు నిపుణులు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు.. రోజూ మాట్లాడుకునే సమయం అంతగా లేనప్పుడు ఇదెంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగని మనస్పర్థలూ, గొడవలూ సున్నితమైన విషయాలే మాట్లాడుకోవాలని అనుకోకండి. మంచీ, చెడూ అన్నీ చర్చించుకోవాలి.

* గత ఏడురోజుల్లో మీకు ఆనందం కలిగించినవీ, నష్టం కలిగించినవీ, ఇంటికి సంబంధించి ఇద్దరూ వేర్వేరుగా తీసుకున్న బాధ్యతలూ, వాటిలో ఎదుర్కొన్న ఇబ్బందులూ, వచ్చేవారానికి మీరు చేయబోయే పనులు, వాటికి భాగస్వామి నుంచి కావాల్సిన సహకారం.. ఇలా ప్రతిదీ మాట్లాడుకోండి. ఇందుకో గంట కేటాయించండి. పనిలోపనిగా వచ్చేవారం చేయాల్సిన పనులనూ పక్కాగా రాసుకోండి.

* ప్రణాళిక అంటే...వాస్తవానికి అనుకున్నది అనుకున్నట్లు చేయాలి. కానీ బంధంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. అలాకాకుండా... పట్టిందే పట్టు అన్నట్లు ఉండకూడదు. అప్పుడే మీ ఇల్లు స్వర్గధామంలా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్