మౌనమే మేలోయి

సంసారమన్నాక సమస్యలు ఉంటాయి. సంతోషాలు పంచుకున్నప్పుడు రాని అహం... చిన్న విషయంలో మాట పడాల్సి వచ్చినా అడ్డం పడిపోతుంది. అది మీ మధ్య గోడకట్టేయకుండా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. సరదాగా వచ్చే సమస్యలైనా, మాట తూలినందుకు ఫలితం అయినా సమస్యను సమస్యగానే చూడండి. దాన్ని పాత పొరబాట్లతో ముడిపెట్టొద్దు. సమస్య ఎవరి వల్ల వచ్చినా ముందు మీరే చొరవ తీసుకుని

Published : 28 Sep 2021 01:11 IST

సంసారమన్నాక సమస్యలు ఉంటాయి. సంతోషాలు పంచుకున్నప్పుడు రాని అహం... చిన్న విషయంలో మాట పడాల్సి వచ్చినా అడ్డం పడిపోతుంది. అది మీ మధ్య గోడకట్టేయకుండా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి.

సరదాగా వచ్చే సమస్యలైనా, మాట తూలినందుకు ఫలితం అయినా సమస్యను సమస్యగానే చూడండి. దాన్ని పాత పొరబాట్లతో ముడిపెట్టొద్దు. సమస్య ఎవరి వల్ల వచ్చినా ముందు మీరే చొరవ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి.

ఇద్దరి మధ్య సరైన అవగాహన, అనుబంధం ఉన్నప్పుడు గొడవలకు అవకాశం ఉండదు. అందుకే లోపాల్ని సమీక్షించుకోండి. తప్పు మీదే అయితే నిజాయతీగా ఒప్పుకోవడం, అవతలి వారిదైతే... మారే అవకాశం ఇవ్వడం వల్ల ఇబ్బందులు రావు.

గొడవకి కారణం ఏదైనా ఇద్దరికీ ఎవరి వాదనలు వారికి ఉంటాయి. కొన్నిసార్లు నిజంగానే తప్పు జరగకపోయినా ఆవేశం, అహం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేస్తాయి. ఆ పరిస్థితి రానివ్వొద్దు. వీలైనంత మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు ఎంత పెద్ద గొడవ అయినా సులువుగానే పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్