Published : 02/10/2021 01:10 IST

మీ అలవాట్లూ ప్రభావితం చేస్తాయి

పిల్లలకి అన్నం తినిపించడం చాలామంది అమ్మలకు తలకు మించిన భారం. ఇలాంటప్పుడు ఓర్పుగా, నేర్పుగా తినిపించగలగాలంటే....

* పిల్లలు రోజూ ఒకే తరహా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ అదే పెట్టాల్సి వస్తే ఫ్లేవర్లు, ఆకృతుల్లో మార్పులు తెచ్చి పెట్టండి. ఉదాహరణకు ఎప్పుడూ రవ్వ ఇడ్లీని చేయొద్దు. ఒక్కోసారి బీట్‌రూట్‌, వెజిటెబుల్‌ లేదా పనీర్‌... వంటి వారికి నచ్చే పదార్థాలతోనూ చేసివ్వొచ్చు.

* ఆహారంపై ఇష్టం పెంచాలంటే కథల రూపంలోనో, పాటల రూపంలోనో వాటి ప్రత్యేకతలను తెలిసేలా చేయండి. పెరిగే టొమాటో, వంకాయ; కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరల్ని వారే పెంచేలా చేయండి. ఇవన్నీ తెలియకుండానే ఇష్టాన్ని పెంచుతాయి. అలానే ఒక్కో వంటకాన్నీ వేర్వేరు పద్ధతుల్లో చేసి రుచి చూపించండి. వారి నిర్ణయాన్ని చెప్పమనండి.

* మీ ఆహారపుటలవాట్లూ పిల్లలపై ప్రభావితం చూపుతాయని మరిచిపోవద్దు మీరేమో ఘుమఘుమలాడేలా మసాలాలూ, జంక్‌ఫుడ్‌ తింటూ పిల్లలు మాత్రం ఫలానావే తినాలి అనడం, మీకు నచ్చని, తినని పదార్థాలను ఇంట్లో వండకపోవడం వల్ల ఇంట్లో సాధ్యమైనంతవరకూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే వండాలి. మీరు తినడం వల్ల వాళ్లూ మిమ్మల్ని అనుసరిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని